Site icon NTV Telugu

Threat: జీ-20 వేదికపై భారత జెండాను తొలగిస్తామని బెదిరింపులు.. విచారణ ప్రారంభం

India Flag

India Flag

Audio Clip Threatens Indian Flag At Delhi G20 Venue, Probe Launched: ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత జెండాను తీసివేసి, దాని స్థానంలో ఖలిస్తాన్ కోసం బ్యానర్‌ను ఏర్పాటు చేస్తామని బెదిరింపు వచ్చింది. సెప్టెంబరులో హైప్రొఫైల్ జీ20 సమావేశానికి ప్రగతి మైదాన్‌ వేదికగా ఉన్నందున పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. రెండు రోజుల క్రితం గుర్తుతెలియని నంబర్ నుంచి ఆడియో రికార్డింగ్ అందుకున్న వ్యక్తి నుంచి పక్కా సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

రాడికల్ సిక్కు బోధకుడు అమృతపాల్ సింగ్ కోసం పంజాబ్‌లో జరిగిన భారీ అణిచివేత గురించి ఆడియో క్లిప్‌లో ఉంది.అమృతపాల్ సింగ్ మద్దతుదారులు ప్రగతి మైదాన్‌ను స్వాధీనం చేసుకుంటారని, భారతదేశ జెండాను కిందకు లాగుతారని ఆడియో సందేశం పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కూడా దుర్భాషలాడారు. అల్లర్లు సృష్టించి శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో సహా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ ఆడియో రికార్డింగ్‌ను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్తున్న ఓ ప్రయాణికుడికి అందింది. గత వారం రోజులుగా పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునే ప్రయత్నాల మధ్య ఆడియో క్లిప్ మూలాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రగతి మైదాన్‌తో పాటు నగరంలోని ఇతర సున్నిత ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు.

Read Also: Sukesh Chandrashekar: ఖైదీల సంక్షేమానికి రూ. 5.11 కోట్లు.. తీహార్ జైలు అధికారులకు సుకేష్ లేఖ

ప్రగతి మైదాన్ ఢిల్లీలో ఒక పెద్ద ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్. ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు జరుగుతాయి. 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల నాయకులను ఒకచోట చేర్చే జీ-20 సమావేశం ఈ సంవత్సరం భారతదేశం నిర్వహించే అతిపెద్ద దౌత్య కార్యక్రమాలలో ఒకటిగా భావిస్తున్నారు.ఈ వారం లండన్‌లోని హైకమిషన్‌లో జరిగిన నిరసనపై దర్యాప్తు ప్రారంభించామని వారు తెలిపిన మరుసటి రోజు ఢిల్లీ పోలీసుల ప్రకటన వచ్చింది. ఖలిస్తాన్ బ్యానర్‌లతో నిరసనకారులు ఆదివారం భవనంలోని మొదటి అంతస్తు బాల్కనీ నుండి భారత జెండాను దించి అవమానించారు.

Exit mobile version