NTV Telugu Site icon

Volodymyr Zelenskyy: ఉక్రెయిన్‌ అధ్యక్షుడి హతమార్చేందుకు యత్నం.. చివరకు ఏమైందంటే..?

New Project (1)

New Project (1)

ఉక్రెయిన్ కీలక విషయాన్ని వెల్లడించింది. గత కొన్ని నెలలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు దేశాల్లో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందేంటంటే.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో తన వ్యక్తిగత రక్షణను పర్యవేక్షించే విభాగాధిపతి(బాడీగార్డ్‌ చీఫ్‌)ను అధ్యక్షుడు తొలగించారు. స్టేట్‌ ప్రొటెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతి సెర్గియ్‌ లియోనిడోవిచ్‌ రుడ్‌ను తొలగించినట్లు పేర్కొన్నారు. ఆయన్ను తప్పించడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. కొద్దిరోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కుట్రకు సంబంధించి స్టేట్‌ గార్డ్‌ విభాగానికి చెందిన ఇద్దరు కర్నల్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ పన్నిన హత్యా ప్రణాళిక అమలులో వారి పాత్ర అనుమానాస్పదంగా ఉందని ఉక్రెయిన్‌ అధికారులు చెప్పారు.

READ MORE: Karnataka Horror: ముగ్గురి కిడ్నాప్, వారి ప్రైవేట్ భాగాలపై విద్యుత్ షాక్‌తో చిత్రహింసలు.. వీడియోలు వైరల్

కాగా.. గతంలోనూ జెలెన్‌స్కీ ని హతమార్చేందుకు రష్యా పలుమార్లు కుట్ర పన్నినట్లు పేర్కొంది. మరోపక్క.. పుతిన్‌ ప్రభుత్వం తన వాంటెడ్‌ లిస్ట్‌లో జెలెన్‌స్కీ పేరును చేర్చింది. నేరాభియోగాలు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. ఆయన పేరు కొన్ని నెలలుగా జాబితాలో ఉన్నప్పటికీ.. ఆ సంగతి ఇప్పుడే వెలుగులోకి వచ్చిందని ఇటీవల రష్యా మీడియాలో వార్తలొచ్చాయి. ఉక్రెయిన్‌లోని రెండో అతి పెద్ద నగరమైన ఖర్కివ్‌పై రష్యా కన్నేసింది. ఈ నగరాన్ని ఆక్రమించే దిశగా ముందుకు సాగుతోంది. ఖర్కివ్‌ సరిహద్దుల్లోని ఐదు గ్రామాలను ఇప్పటికే ఆక్రమించింది. సుమారు 1800 మంది పౌరులను ఆ గ్రామాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో భారీస్థాయిలో పోరు జరుగుతోందని, ఐదు గ్రామాలను మాస్కో ఆక్రమించడంతో ఆ ప్రాంతానికి అదనపు దళాలను పంపినట్లు కీవ్‌ పేర్కొంది. బెల్‌గరోద్‌పై ఉక్రెయిన్‌ నేరుగా దాడి చేయకుండా నిరోధించేందుకు ఖర్కివ్‌ ప్రాంతంలో బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేసుకోవడానికి రష్యా సైన్యాలు ప్రయత్నిస్తున్నాయి.