NTV Telugu Site icon

Sai Dharam Tej: మెగా హీరోపై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం..

Sai Dharam Tej

Sai Dharam Tej

Sai Dharam Tej: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బరిలోకి దిగిన పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారానికి కదలివస్తున్నారు మెగా హీరోలు.. జనసేనాని గెలుపు కోసం తమ వంతు సాయం చేస్తున్నారు.. అయితే, సినీ నటుడు, పవన్ కల్యాణ్‌ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌పై దాడికి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది.. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ప్రచారంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్‌పై కూల్‌ డ్రింక్ బాటిల్ విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు.. అయితే, సాయి ధరమ్‌ తేజ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.. కానీ, పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్‌కు ఆ కూల్‌ డ్రింక్‌ బాటిల్ తగలడంతో తీవ్ర గాయం అయ్యాయింది.. కంటి పై భాగంలో బాటిల్‌ బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స నిమిత్తం వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

Read Also: Lok Sabha Elections 2024: సినీ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య విమర్శలు

ఇక, హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. గాయపడిన శ్రీధర్ ని పరామర్శించి.. ఘటన ఏ విధంగా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. అంతకుముందు సాయి ధరమ్‌ తేజ్ రోడ్ షో.. తాటిపర్తి నుంచి చిన్న జగ్గంపేట వెళ్తుండగా.. వైసీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. బాణసంచా కాలుస్తూ హడావిడి చేయడంతో.. ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగినట్టుగా చెబుతున్నారు. ఈ ఘటనకు సాయి ధరమ్‌ తేజ్‌పై దాడి యత్నానికి ఏదైనా లింక్‌ ఉందా? అనేది తెలియాల్సి ఉంది.