Site icon NTV Telugu

Attack on Inter Student: భార్య వద్దు నీవే కావాలంటూ వేధించాడు.. వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు

Inter Student

Inter Student

Attack on Inter Student: కడప జిల్లా బద్వేల్ సమీపంలో ఇంటర్ విద్యార్థిని బట్టలకు లైటర్‌తో నిప్పంటించిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇంటర్ విద్యార్థినిని రోడ్డుపక్కనే చెట్లలోకి తీసుకెళ్లి విఘ్నేష్ అనే యువకుడు లైటర్‌తో నిప్పంటించాడు. ఈ కేసులో పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం..”విఘ్నేష్ నన్ను ప్రేమ పేరుతో వేధించాడు…నీవు లేకుంటే నేను చనిపోతాను అంటూ బెదిరించాడు.. విఘ్నేష్‌కు ఆరు నెలల క్రితమే ప్రేమ వివాహం అయింది…తాను కట్టుకున్న భార్య వద్దని నీవే కావాలంటూ నన్ను వేధించాడు… అందుకోసమే నేను విఘ్నేష్‌తో కలిసి అటవీ ప్రాంతంలోకి వెళ్లాను… తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు…నేను నిరాకరించినందుకు లైటర్‌తో నా డ్రెస్‌కు నిప్పంటించాడు.” అని పోలీసులకు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. ఉదయం నుంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని ప్రచారం జరుగుతోంది. విగ్నేష్ లైటర్‌తో తన డ్రెస్‌కు నిప్పు అంటించడం వల్లే గాయాలు అయ్యాయని బాధితురాలు వాస్తవాలను వెల్లడించింది. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Read Also: AP Crime: ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు

Exit mobile version