Site icon NTV Telugu

Crime News: కడప జిల్లాలో కులహంకార దాడి.. కర్రతో కొట్టి మరిగే నూనె పోశారు..

Crime News

Crime News

Crime News: కడప జిల్లాలో కులహంకార దాడి ఘటన చోటుచేసుకుంది. ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు గ్రామంలో కులహంకార దాడి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కదిరి ప్రభాకర్‌ అనే వ్యక్తిపై గజ్జల సుబ్బారెడ్డి అనే వ్యక్తి కర్రతో కొట్టడంతో పాటు మరిగే నూనెను పోసినట్లు తెలిసింది. కదిరి ప్రభాకర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్‌కు తరలించారు.

Read Also: Viral Video: ఎంత ట్యాలెంటెడ్ బ్రో నువ్వు.. కరిచిన పామును ఏకంగా ఆసుపత్రికి తీసుకెళ్లి..

అసలేం జరిగిందంటే..
బాధితుడి కుటుంబ సభ్యుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. కదిరి ప్రభాకర్‌ పొరుగు గ్రామమైన గంగపేరూరులో సమీప బంధువు మృతి చెందడంతో అంత్యక్రియలకు వెళ్లి వస్తూ గజ్జల సుబ్బారెడ్డి ఇంటికి సమీపంలోని అరుగుపై సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయం నుంచి అన్నం తినక పోవడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. అగ్రకులస్థుల ఇళ్లు ఉన్న అరుగుపై దళితుడైన ప్రభాకర్ నిద్రించడంతో కులం పేరుతో దూషిస్తూ కర్రతో దాడి చేయడంతో పాటు మరిగే నూనె పోశాడు షాప్ యజమాని సుబ్బారెడ్డి. భర్త సొమ్మసిల్లి పడిపోవడంతో భార్య సుబ్బమ్మ ప్రభాకర్‌ను ఆటోలో ఇంటికి తీసుకెళ్లింది. రాత్రంతా నిద్రపోకుండా ఒళ్లంతా మంటగా ఉందటూ ప్రభాకర్ ఆహాకారాలు చేయడంతో అతని భార్య మజ్జిగ తాపించింది. మరోమారు మంటగా ఉందని చెప్పడంతో ప్రభాకర్ చొక్కా విప్పి చూడగా ఒంటిపై బొబ్బలు కనిపించాయి. బొబ్బలు చూసి ఏమి జరిగిందని భార్య ఆరా తీయగా.. జరిగిన విషయాన్ని ప్రభాకర్ చెప్పాడు. గ్రామీణ ప్రాంతం కావడంతో ఆ సమయంలో ఆటో దొరకక ఉదయాన్నే రిమ్స్ కు తరలించారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్‌ పరిస్థితిపై 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. దళితులపై తరచుగా దాడులు జరగడంపై కుల, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాయపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్ష పడేలాగా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Exit mobile version