Site icon NTV Telugu

Chandragiri: చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి

Pulivarthi Nani

Pulivarthi Nani

Chandragiri: ఏపీలో పోలింగ్ తర్వాత కూడా దాడు ఆగడం లేదు. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి జిల్లా స్ట్రాంగ్‌ రూమ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించేందుకు వచ్చిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. రామాపురంకు చెందిన ఓ వైసీపీ నేత, అతని అనుచరులు సుత్తి, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా.. గన్‌మెన్‌కు బాగా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పులివర్తి నాని గన్‌మెన్‌ రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పులు జరపగా.. నిందితులు అక్కడి నుంచి వెళ్లపోయారు. ఈ దాడి గురించి పులివర్తి నాని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.

Read Also: High Tension at Palnadu: పల్నాడు జిల్లాలో మరోసారి ఉద్రిక్తతలు.. గాల్లోకి పోలీసుల కాల్పులు!

పులివర్తి నానిపై దాడి నేపథ్యంలో పద్మావతి మహిళా వర్శిటి స్టాంగ్ రూం వద్ద పరిస్థితులు అదుపు తప్పాయి. పులివర్తి నానికి మద్దతు చేరుకున్న వేలాది మంది కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వైసీపీ నేత వాహనాన్ని ధ్వంసం చేశారు. నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పద్మావతి వర్సిటీ లోపలే టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగుతున్నారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Exit mobile version