Shraddha Case: ఆఫ్తాబ్ను వాహనంలో తరలిస్తుండగా కత్తులతో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలపై కత్తులతో దాడి జరిగింది. ఢిల్లీలోని రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో రెండో విడత పాలీగ్రాఫ్పరీక్ష ముగిసిన తర్వాత.. ఆఫ్తాబ్ను తరలిస్తున్న పోలీస్వ్యాన్పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. ఆఫ్తాబ్ను జైలుకు తరలిస్తున్న సమయంలో కత్తులతో వచ్చి అతడిని చంపేందుకు యత్నించారు. పోలీసు వ్యాన్‌ను బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు చేశారు. ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని అడ్డుకుని ఆపడానికి కూడా ట్రై చేశారు. అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాకర్ హత్య కేసులో పోలీసులు మరికొంత పురోగతి సాధించారు.
Read Also: Hacking : ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ హ్యాక్.. రూ.200కోట్లు డిమాండ్
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
శ్రద్ధావాకర్ మృతదేహాన్ని 35ముక్కలుగా కోసేందుకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. శ్రద్ధ ఉంగరాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్తాబ్.. శ్రద్ధా ఉంగరాన్ని తనతో డేటింగ్ చేస్తున్న మరో యువతికి బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. తనతో సహజీవనం చేసిన శ్రద్ధా వాల్కర్‌ని.. అఫ్తాబ్ వాల్కర్‌ని అతి కిరాతకంగా హత్య చేశాడు. 35 ముక్కలుగా చేసి.. ఫ్రిజ్‌లో పెట్టి.. ఆపై వాటిని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. అయితే ఆరు నెలల తర్వాత ఈ విషయం బయటకొచ్చింది. శ్రద్ధ వాకర్ తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయడంతో.. మొత్తం విషయం బయటకొచ్చింది. వెంటనే అఫ్తాబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో కూడా అఫ్తాబ్ తన నేరాన్ని అంగీకరించాడు.
#WATCH | Police van carrying Shradhha murder accused Aftab Poonawalla attacked by at least 2 men carrying swords who claim to be from Hindu Sena, outside FSL office in Delhi pic.twitter.com/Bpx4WCvqXs
— ANI (@ANI) November 28, 2022
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..