NTV Telugu Site icon

Hyderabad: నేరేడుమెట్ లో దారుణం.. బాలికపై ఐదుగురు యువకుల గ్యాంగ్ రేప్

Gangrape

Gangrape

నిర్భయ వంటి చట్టాలు ఎన్ని ఉన్నా.. ఎన్ కౌంటర్ లు ఎన్ని జరుగుతున్నా.. మృగాళ్ల వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు క్రమంగా పెరుగుతున్నాయి. మత్తు పదార్థాలకు బానిసలుగా మరుతున్న యవకులు ఆ మత్తులు దారుణాలకు ఒడిగడుతున్నారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నేరేడుమెట్ లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఐదుగురు యువకుల గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసి నేరేడ్మెట్ తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు యువకులు.

READ MORE: Revanth Reddy: ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ భేటీ..కీలక అంశాలపై చర్చ

కాచిగూడ లో ఉంటున్న మైనర్ అమ్మాయని కి గంజాయి అలవాటు చేశారు. మైనర్ అమ్మాయి గంజాయి మత్తులోకి దిగానే అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పకుండా దాచిపెట్టింది. శరీరంలో మార్పులు రావడంతో గమనించిన తల్లి నిలదీసింది. బాలిక జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. బాలిక ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు నేరేడ్మెట్ కు బదిలీ చేశారు. బాలికపై అత్యాచారం చేసిన యువకుల కోసం గాలిస్తున్నారు. వెంటనే పట్టుకుంటామని చెబుతున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.