Site icon NTV Telugu

Doctor Stabbed: నాసిక్‌లో దారుణం.. వైద్యుడిపై 18 సార్లు కత్తితో దాడి

Doctor

Doctor

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ వైద్యుడిపై కత్తితో దాడి చేశాడు. కాగా.. డాక్టర్ కైలాష్ రాఠీగా గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు నాసిక్‌ పంచవటిలోని సుయోగ్ హాస్పిటల్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

Read Also: Delhi: ఢిల్లీలో సంచలనం రేపిన 8వ తరగతి విద్యార్థి హత్య కేసు..

ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో రాత్రివేళ కూర్చుని ఉన్నాడు. లోపలికి చొరబడ్డ నిందితుడు డాక్టర్‌పై కత్తితో 18 సార్లు దాడి చేశాడు. దీంతో డాక్టర్ కైలాష్ రాఠీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన అనంతరం.. ఆసుపత్రిలో ఉన్న రోగులు భయాందోళనకు గురయ్యారు. కాగా.. దాడి ఘటన మొత్తం ఐసీయూలో అమర్చిన సీసీటీవీలో రికార్డయింది. అయితే.. ఆర్థిక వివాదాల కారణంగా నిందితుడు డాక్టర్‌పై దాడికి పాల్పడినట్లు సమచారం.

Read Also: White Hair Home Remedies: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. వారానికి ఒకసారి ఇలా చేయండి..!

సీసీటీవీ ఫుటేజ్ లో చూసినట్లైతే.. వైద్యుడు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండగా నిందితుడు తల, మెడపై కత్తితో అతి దారుణంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. డాక్టర్ రాఠీ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

Exit mobile version