Bihar News: బీహార్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. నలంద పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్బైత్ గ్రామంలో ఓ యువకుడిని ఇంటి నుంచి తీసుకుని వెళ్లిన తన స్నేహితుడు అనంతరం కాల్చిచంపాడు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. అయితే ఘటనా స్థలం నుంచి పారిపోతున్న ఇద్దరు స్నేహితులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి ఒక పిస్టల్, 14 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మహ్మద్ అల్మాజ్(18)గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Virat kohli Duck: విరాట్ కోహ్లీ డకౌట్ కావాలి.. మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు స్నేహితులు ఇంటికి వచ్చి తన కొడుకును తీసుకెళ్లినట్లు మృతుడి తండ్రి చెప్పాడు. అయితే కొంత సమయం తర్వాత తనను కాల్చి చంపినట్లు స్థానికులు చెప్పారని అన్నాడు. మృతుడు అల్మాజ్ తన స్నేహితుడు చెరువులో స్నానం చేస్తుండగా అభ్యంతరకరమైన వీడియో తీశాడని.. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని అనడంతో ఈ దారుణ ఘటనకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు రాజ్‌గిర్ డీఎస్పీ ప్రదీప్ కుమార్ తెలిపారు. ఇద్దరి నుంచి ఒక పిస్టల్, 14 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు అల్మాజ్ తన స్నేహితుడి వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో స్నేహితుడికి కోపం వచ్చి.. హత్య చేశాడని పోలీసులు చెప్పారు.
