NTV Telugu Site icon

Kidnap: మధ్యప్రదేశ్లో దారుణం.. అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్

Kidnap

Kidnap

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ బాలికను బహిరంగంగా కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఉదయం 9.30 గంటలకు ఝాన్సీ రోడ్డులోని బస్టాండ్‌లో ఒక అమ్మాయి తన కుటుంబంతో సహా దిగింది. అయితే ఆ సమయంలో.. తన తమ్ముడిని టాయిలెట్‌కు తీసుకెళ్దామని సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్లింది. ఇంతలోనే బైక్‌పై అక్కడికి వచ్చిన ఇద్దరు అగంతకులు.. బలవంతంగా యువతిని బైక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు.

Read Also: Atrocious: ఆవేశంలో అత్తను చంపిన అల్లుడు..

కిడ్నాప్కు గురైన అమ్మాయి బర్హా గ్రామానికి చెందిన నివాసి. ఆమే సేవాదా కళాశాలలో చదువుతోంది. ఇదిలా ఉంటే.. నిందితుల కోసం వెతుకులాట జరుగుతుండగా.. ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. యువతి కిడ్నాప్‌ ఘటన మొత్తం పెట్రోల్‌ పంపులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. పరారీలో ఉన్న నిందితులిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also: Fire Accident: లక్నోలోని కెనరా బ్యాంక్‌లో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో 50 మంది..!

ఈ ఘటనపై పెట్రోల్ పంప్‌లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా, మరొకరు ముఖానికి గుడ్డ కప్పి ఉండటం వీడియోలో కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల బిఎ విద్యార్థిని సోమవారం ఉదయం 8:50 గంటలకు బస్సు దిగిన నిమిషాలకే కిడ్నాప్ కు గురైంది. దీపావళిని జరుపుకోవడానికి ఆమె కుటుంబంతో కలిసి భింద్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించి నిందితుల కోసం గాలిస్తున్నారు.