NTV Telugu Site icon

Viral News : వార్నీ.. ఇదేం పెళ్లి కార్డు సామి.. పిచ్చి మాములుగా లేదుగా..

Pelli Card

Pelli Card

ఈరోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా స్పెషల్ ఉండాల్సిందే అంటున్నారు జంటలు.. జీవితంలో చేసుకొనే అతి ముఖ్యమైన వేడుక కావడంతో జనాలు క్రేజీగా ఆలోచిస్తున్నారు.. తాజాగా ఓ పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ పెళ్లి కార్డు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కార్డ్‌లను చూసి ఉంటారు. లీవ్‌ లెటర్‌ టైప్‌లో రాయడం, ప్రశ్నాపత్రంలో టైప్‌లో వెడ్డింగ్‌ కార్డులు ఈ మధ్య వైరల్‌ అయ్యాయి. ఇదీ అంతకు మించి ఉంది. చూడ్డానికి ఏటీఎం కార్డులా ఉండే వెడ్డింగ్ కార్డును మీరెప్పుడైనా చూశారా..? అది చూస్తే అచ్చం ఏ ఏటీఎం కార్డు అని అనుకుంటారు.. ఈ కార్డుకు ఒకవైపున వధూవరుల పేరు, పెళ్లి తేదీతోపాటు ‘పెళ్లి ఆహ్వానం’ రాసి ఉంటుంది. మరోవైపు, ఇతర ముఖ్యమైన సమాచారం ముద్రించబడింది. ఇన్‌స్టాగ్రామ్‌లోపేజీ ద్వారా ఈ ప్రత్యేకమైన కార్డ్ పోస్ట్ చేయబడింది. ఇక్కడ మీరు వివాహ కార్డుల యొక్క అనేక ప్రత్యేకమైన సేకరణలను కనుగొంటారు.. ఇప్పుడు ఈ కార్డు వైరల్ అవుతుంది..

ఈ పెళ్లి కార్డు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ ను కూడా అందుకుంటుంది.. కోటికి పైగా, వ్యూస్‌, 1 లక్ష 33 వేల లైక్‌లు వచ్చాయి. ఏదైనా కొత్తగా క్రేజీగా చేయాలి అనుకునేవాళ్లకే ఇలాంటి ఐడియాలు వస్తాయేమో కదా..  ఈ వీడియో చూసిన చాలా మంది.. దీని ధర ఎంత., నాకు కూడా ఇలాంటి కార్డులు కావాలి, నేను కూడా నా పెళ్లికి ఇలాంటివే చేయించుకుంటా అని కామెంట్‌ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఆ పెళ్లి కార్డు ఎంత బాగుందో మీరు ఒక లుక్ వెయ్యండి..