Atharva : ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అథర్వ మూవీ గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రంలో కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ మూవీకి మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించారు.అయితే ఈ చిత్రానికి థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ వచ్చింది. అథర్వ చిత్రంలో కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నా.. కథనం మాత్రం నెమ్మదిగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కార్తిక్ రాజు మరియు సిమ్రన్ చౌదరి పర్ఫార్మెన్స్ ప్లస్ అయ్యాయి. శ్రీచరణ్ పాకాల బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్టుగా ఉంటుంది. అలాగే చరణ్ సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తుంది.ఇదిలా ఉంటే థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోని అథర్వ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.అథర్వ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 18వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ నేడు (జనవరి 15) అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది.
”ఈ టీవీ విన్ సబ్‍స్క్రైబర్లకు సంక్రాంతి గిఫ్ట్ వచ్చేస్తుంది. మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు క్లూస్ టీమ్‍లోని బయోమెట్రిక్ అనలిస్ట్ ప్రయత్నిస్తారు. ఇన్వెస్టిగేషన్ సంక్లిష్టంగా మారుతుంది. మరి మిస్టరీని అతడు ఛేదించగలిగాడా” అని ఈటీవీ విన్ ట్వీట్ చేసింది. అలాగే, జనవరి 18న అథర్వ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుందని ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.ఈ చిత్ర కథ విషయానికి వస్తే..దేవ అథర్వ కర్ణ (కార్తిక్ రాజు) పోలీస్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే, అతడికి ఆస్థమా ఉండడంతో అది సాధ్యం కాదు. దీంతో పోలీస్ శాఖలోనే క్లూస్ టీమ్‍లో జాయిన్ అవొచ్చని ఓ వ్యక్తి సలహా ఇవ్వడంతో ఆ దిశగా అతడు ప్రయత్నాలు చేస్తాడు. మొత్తంగా క్లూస్ టీమ్‍లో ఉద్యోగం సాధిస్తాడు. తన తెలివితో చాలా కేసులను అథర్వ అలియాజ్ కర్ణ పరిష్కరిస్తాడు.. అథర్వ ఓ మర్డర్ కేసును దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన చిక్కులు, సవాళ్లు ఏంటి..అనేది ఈ చిత్ర కథ..థియేటర్స్ లో అంతగా మెప్పించని అథర్వ ఓటీటీ ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
Sankranti gifts to Subscriber are on the way 🤗❤️🔥
A biometric analyst from the clues department tries to unravel murder mystery. When the investigation becomes more complex, it leads to a twisted path. Will he be able to unravel the chain of mystery?#Atharva#EtvWin… pic.twitter.com/PoKDF3ocfr
— ETV Win (@etvwin) January 15, 2024
- Tags
- Atharva
- Karthik Raju
- OTT
- Streaming
తాజావార్తలు
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!