Atchannaidu Fire On Cm Jagan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాను టీడీపీ నేతలు కలిశారు. సీఈవోను కలిసిన వారిలో అచ్చెన్నాయుడు, అశోక్ బాబు, ఇతర నేతలు ఉన్నారు. రాష్ట్రంలో ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్లపై టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఎనిమిది జిల్లాల కలెక్టర్లపై సీఈఓకు టీడీపీ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దొంగే దొంగ అన్నట్లు వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతారు అంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ అదేశాలిస్తున్నా.. కలెక్టర్లు చెత్తబుట్టలో వేస్తున్నారు.. 8 జిల్లాల కలెక్టర్లు అడ్డగోలుగా పని చేస్తున్నారు అని అచ్చెన్నాయుడు తెలిపారు.
Read Also: Shrimp Farming : రొయ్యల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
శ్రీకాకుళం, కోనసీమ, బాపట్ల, గుంటూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం జిల్లాల కలెక్టర్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాప్తాడులో 20 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేసినా అనంతపురం కలెక్టర్ పట్టించుకోలేదు.. కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ల మార్పు ఈసీ ఆదేశాల ప్రకారం జరగాలి.. ఉరవకొండ, చంద్రగిరి, పర్చూరు వంటి 17 నియోజకవర్గాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఫారం -6, ఫారం -7 విషయంలో నోటీసులు ఇవ్వకుండా మార్పులు చేస్తే బీఎల్ఓలను బాధ్యులు చేస్తామని సీఈవో హామీ ఇచ్చారు.. తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టత ఇచ్చారు అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. బీఎల్ఓ వేరిఫికేషన్ లేకుండానే ఒకేసారి భారీగా ఓట్లు తొలగిస్తున్నారు.. ఎమ్మార్వో ఆఫీసుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఓట్లు తొలగిస్తున్నారు.. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఈవో హామీ ఇచ్చారు అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన వెల్లడించారు.