NTV Telugu Site icon

Atchannaidu: మత్స్యకారుల బతుకుల్ని ఆగం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే సొంతం..

Atchannaidu

Atchannaidu

గంగ పుత్రులకు మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం.. మత్స్యకారుల బతుకుల్ని ఛిద్రం చేసిన ఘనత జగన్ రెడ్డికే సొంతం అని విమర్శించారు. సుదీర్ఘ సముద్రతీరం, నిపుణులైన మన మత్స్యకుటుంబాలు రాష్ట్రానికి ఓ వరం.. టీడీపీ అధికారంలో ఉన్నపుడు రాష్ట్ర మత్స్య రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేశాం.. 2014-19 ఐదేళ్ల కాలంలోనే ఏకంగా రూ.788.38 కోట్లను ఖర్చు చేశాం.. ఆదరణ పథకం కింద వలలు, పడవలు, ఐస్ బాక్సులు సహా ఇతర వృత్తి పరికరాలను 90% సబ్సిడీతో అందించామన్నారు. ఇన్ ల్యాండ్ సొసైటీ మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీతో వలలు, పడవలు అందించామని అచ్చెన్నాయుడు అన్నారు.

Read Also: Pro Kabaddi League 10: మరో సీజన్కు సిద్ధమైన ప్రో కబడ్డీ.. డిసెంబర్ 2 నుంచి మ్యాచ్లు ప్రారంభం

డీప్ సీ ఫిషింగ్ నెట్స్, ఏరియేటర్స్, ఇన్లాండ్ నెట్స్, ఇన్లాండ్ బోట్స్, ఫైబర్ బోట్స్, గిల్ నెట్స్, రిఫర్ వ్యాన్స్, సముద్రపు పంజరాలు అందించామని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. డీజిల్ సబ్సిడీ తీసుకొచ్చి మత్స్యకారులకు తోడుగా నిలిచాం.. దేశంలో తొలిసారిగా 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు పెన్షన్ అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే.. మత్స్యకారుల పిల్లల చదువుల కోసం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆరు రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించామని ఆయన చెప్పుకొచ్చారు. వేటకు వెళ్లి మరణించిన వారికి నెల రోజుల్లోనే డెత్ సర్టిఫికెట్ అందించి రూ. 5 లక్షల బీమా కల్పించామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Read Also: Nirmala Sitharaman: తెలంగాణను కేసీఆర్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చింది..

హేచరీల్లో చేపపిల్లలు పెంచి చెరువులు, రిజర్వాయర్లలో వదిలి మత్స్యకారులకు వేట బాధ్యతలు అప్పగించారు అని అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో ఆక్వా ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, చేతకానితనంతో దిగజారిపోయింది.. ఆక్వా రైతులకు జగన్ రెడ్డి వచ్చాక విద్యుత్ సబ్సిడీ నిలిపివేశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లను మత్స్యకార సొసైటీలకు కాకుండా బహిరంగ వేలం వేసేలా జీవో నెం.217 తెచ్చి మత్స్యకారుల పొట్టకొట్టారు.. రాష్ట్రంలోని మత్స్యకారులకు, మత్స్యరంగానికి మెరుగైన రోజులు రావాలంటే తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలందరిపైనా ఉంది అని అచ్చెన్నాయుడు చెప్పారు.