Site icon NTV Telugu

Atchannaidu: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నాయుడు లేఖ.. ఈసారి ఎవరిపై ఫిర్యాదు అంటే..?

Atchannaidu

Atchannaidu

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన CFMS వ్యవస్థను నాశనం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన CFMSను ముఖ్యమంత్రి కార్యాలయం ఆధీనంలోకి తీసుకుంది.. సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి నిధులను దారి మళ్లిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా నిలిచే కాంట్రాక్టర్‌లకు CFMS ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం కార్యాలయం నుంచే అనేక చెల్లింపులు జరుగుతున్నాయి.. వెంటనే ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుజయ్ రెడ్డిలను తక్షణమే విధుల నుంచి తప్పించాలని పేర్కొ్న్నారు.

Read Also: Youtube: ఇండియాలో 2.25 మిలియన్ల వీడియోలను తొలగించిన యూట్యూబ్..

మరోవైపు.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా, ఇంకా ముఖ్యమంత్రి ట్విట్టర్ హ్యాండిల్లో జగన్ ఫోటో ఉండటంపై అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ సీఎం ట్విట్టర్ హ్యాండిల్‌లో సంక్షేమ పథకాలపై చరిత్ర సమాచారం ఉందని లేఖలో తెలిపారు. సీఎంకు సంబంధించి అన్ని ఫోటోలు, సంక్షేమ పథకాల సమాచారం ప్రభుత్వ ట్విట్టర్ హ్యాండిల్ నుండి తొలగించాలని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ను విస్మరించినందుకు అధికారులపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.

Read Also: AP CEO: వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ భేటీ..

Exit mobile version