NTV Telugu Site icon

Teacher Harassment: రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులపై టీచర్ కిరాతకం..

Up School

Up School

పాఠశాలకు రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులపై టీచర్ కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోరఖ్‌పూర్‌లోని ఓ పాఠశాలలో జరిగింది. బాలికలు రెండు జడలు వేసుకరాలేదని ప్రధానోపాధ్యాయురాలు తీవ్ర ఆగ్రహానికి గురై వారిని దారుణంగా చితకబాదింది. దీంతో.. ఓ విద్యార్థి అపస్మార స్థితికి వెళ్లింది. ఈ సమాచారం ఉన్నతాధికారులకు తెలియడంతో ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. అలాగే ఆమెపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం

ఈ ఘటన ఖోరాబార్ బ్లాక్‌లోని సెకండరీ స్కూల్‌లో చోటు చేసుకుంది. ఎనిమిదో తరగతి విద్యార్థినులను రెండు జడలు వేసుకురాలేదని ప్రధానోపాధ్యాయురాలు అభా దూబే దారుణంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో.. బీఈవో వీకే రాయ్ ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినుల నుంచి సమాచారం తీసుకున్నారు. విద్యార్థులందరూ తమకు ఎదురైన కష్టాలను వివరించారు. మేడమ్ క్లాస్‌కి వచ్చిన వెంటనే విద్యార్థుల బ్రెయిడ్‌లను తనిఖీ చేయడం ప్రారంభించిందని విద్యార్థులు చెప్పారు. ఈ సమయంలో.. రెండు జడలు వేసుకుని రాని విద్యార్థినుల జడలు పట్టుకుని కనికరం లేకుండా కొట్టడం ప్రారంభించిందని తెలిపారు. ఓ విద్యార్థినిని అతి దారుణంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. ఇది చూసి తాము భయంతో కేకలు వేశామన్నారు. అనంతరం.. ఈ ఘటనపై విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో.. వారు పాఠశాలకు చేరుకుని ప్రశ్నించారు.

Read Also: Zhong Yang: చైనా ‘బ్యూటిఫుల్ గవర్నర్’కు 13 ఏళ్ల జైలు శిక్ష..

మరోవైపు.. ప్రధానోపాధ్యాయురాలిపై బీఎస్‌ఏ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆమెపై విచారణ పూర్తయిందని, ఆరోపణలన్నీ ధృవీకరించిన తర్వాత ఆమె దోషిగా తేలిందని బీఎస్‌ఏ రామేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు సర్వీసు సస్పెండ్ కాగా.. ఆమెను బీఆర్‌సీ ఖోరాబర్‌కు అటాచ్ చేశారు. అంతే కాకుండా.. ఆమెపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.