Site icon NTV Telugu

Hyderabad: రాజ్‌భవన్‌లో ఎట్‌హోం.. బీఆర్ఎస్ హాజరుపై ఉత్కంఠ..!

At Home

At Home

రిపబ్లిక్ డేను పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో తేనేటి విందు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు ఎట్‌హోం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ప్రోగ్రామ్‌కి అధికార, ప్రతిపక్ష నేతలను గవర్నర్ ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో జరిగి ఎట్‌హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. ఇందుకోసం రాజ్‌భవన్ సుందరంగా ముస్తాబైంది. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గులాబీ పార్టీ నేతలు హాజరవుతారా? లేదా? అన్న ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచీ ప్రగతిభవన్‌కు రాజ్‌భవన్ మధ్య వైరం నడిచింది. తాజాగా కాంగ్రెస్ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేయడంతో ఆ వైరం మరింత రాజుకుంది. బీఆర్ఎస్ లీడర్లు గవర్నర్ తీరుపై గుర్రుగా ఉన్నారు.

Bhatti Vikramarka: చందనవెల్లి భూ బాధితులకు డిప్యూటీ సీఎం భరోసా..

గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ ఎంపిక చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించి పంపించిన ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్‌ల పేర్లకు తమిళిసై ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. గవర్నర్ కోటా కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే వారి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళి సై తిరస్కరించారని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటించిన ఆ ఇద్దరు ఎమ్మెల్సీల్లో కోదండరాంను ఎలా అమోదించారని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రకటించిన ఆ ఇద్దరు నేతలకు రాజకీయ పరమైన సంబంధాలు ఉన్నాయని గవర్నర్ చెప్పారని.. ఇప్పుడేమో ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంను గవర్నర్ ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దాసోజ్ శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణలకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాంకు ఎలాంటి అడ్డంకి ఉండదా? అని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.

Akhilesh Yadav: ఆయన ఇండియా కూటమిలో ఉండి ఉంటే ప్రధాని అయ్యేవారు..

గవర్నర్‌పై బీఆర్ఎస్ నేతలు రాజకీయ విమర్శలు చేసిన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో తమిళిసై చేపట్టే ఎట్‌హోం కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలపై గజ్వేల్‌లోని ఫాంహౌస్‌లో కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Exit mobile version