Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ, అస్సాం కాంగ్రెస్ చీఫ్ అయిన గౌరవ్ గొగోయ్‌పై మరోసారి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తానీ ఏజెంట్ ముందు రాష్ట్రంలోని ప్రజలు తలవంచరని ఆదివారం ఆయన అన్నారు. కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో హిమంత మాట్లాడుతూ.. అస్సామీలు పాకిస్తానీ ఏజెంట్ ముందు తలవంచరని, ఏ అపరిచితుడి ముందు కూడా తలవంచరని, తాము బటద్రవ థాన్‌ను ఆక్రమణదారుల నుంచి విముక్తి చేశామని అన్నారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో సీఎం హిమంత మాట్లాడుతూ.. ‘‘ గౌరవ్ గొగోయ్ మీరు వ్యతిరేకించాలనుకుంటే వ్యతిరేకించండి. కానీ అస్సాంకు ఆకాశాన్ని తాకాలనే కల ఉందని, మేము దాన్ని సాధిస్తాము’’ అని అన్నారు.
Read Also: SP Leader: అశ్లీల కంటెంట్ చూసి టెస్టోస్టెరాన్ పెరిగి, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
గౌరవ్ గొగోయ్ పేరును నేరుగా ప్రస్తావించకున్నా, ఈ వ్యాఖ్యలు ఆయన గురించే అని తెలుస్తోంది. గతంలో పలు సందర్భాల్లో నేరుగా గొగోయ్ పాకిస్తాన్ ఏజెంట్ అని, ఆయన భార్య ఎలిజబెత్ కోల్బర్న్కు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉందని సీఎం ఆరోపించారు. గొగోయ్, ఆయన భార్యపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పడింది. సిట్ తన నివేదికను సెప్టెంబర్ 10న సమర్పించింది. మన దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే లక్ష్యంతో పెద్ద కుట్ర జరిగిందనే వాస్తవాలను సిట్ వెలికితీసిందని హిమంత అన్నారు. హిమంత చేస్తున్న ఆరోపణలపై గొగోయ్ స్పందిస్తూ.. ఈ ఆరోపణలు ఒక సీ-గ్రేడ్ బాలీవుడ్ సినిమా లాంటివని, అస్సాం ప్రజలకు అంతా అర్థమవిుతుందని అన్నారు.