Currency notes: ఈ నేత ఎంత దోచుకున్నాడో..! నెట్టింట ఫొటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ నాయకులు పదవుల్లోకి వచ్చాక.. డబ్బు సంపాదనే ధ్యేయంగా దోచుకుంటారని వింటుంటాం. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు.. అధికారంలోకి వచ్చాక ఆయా రూపాల్లో దోచుకుంటుంటారని చెబుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ లీడర్ ఎంత సంపాదించాడో తెలియదు గానీ.. అతడి యొక్క నిజస్వారూపాన్ని బయటపెట్టాడు. రాజకీయాల్లోకి వచ్చాక ఎంత దోచుకున్నాడో.. ఏమో తెలియదు గానీ.. మంచంపై కరెన్సీ నోట్ల మధ్య నిద్రించిన ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అస్సాంలోని ఉదాల్‌గిరి జిల్లాకు చెందిన బెంజామిన్ బసుమతారీ అనే నేత కరెన్సీ నోట్లపై నిద్రించిన చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంచంపై మొత్తం రూ.500 నోటులే ఉన్నాయి.
Also Read
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Hardik Pandya: "కెప్టెన్సీ ఇస్తేనే వస్తా".. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
బెంజామిన్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆయన విలేజ్ కౌన్సిల్ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో పథకాల లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అవినీతి వ్యతిరేక పార్టీగా పేరుగాంచిన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్‌పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Bank Holidays : ఏప్రిల్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
ఫొటో వైరల్ కావడంతో యూపీపీఎల్ పార్టీ చీఫ్ ప్రమోద్ బోరో ఎక్స్ వేదికగా స్పష్టత ఇచ్చారు. బెంజామిన్‌కు తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 10నే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 10నే వీసీడీసీ ఛైర్మన్ పదవి నుంచి కూడా తొలగించినట్లు చెప్పారు. ఆయన చర్యలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Samantha: చరణ్‌కు విషెష్ చెప్పిన సామ్.. కొత్త అనుమానం రేపిందేంటి?
#UPPL member identified as Benjamin Basumatary, the VCDC chairman in Bhairaguri, Udalguri district has gone viral on social media due to of this picture,drawing widespread reaction from all quarters. UPPL is in alliance with #BJP in Assam !
भ्रष्टाचार पर कैसे जीतेंगे जंग ? pic.twitter.com/IRHmOzQzPf— Rishi Raj( ऋषि राज ) (@rishi_raj93) March 27, 2024
🚨 Important Notice 🚨
A photo of Benjamin Basumatry is circulating widely on social media. We want to clarify that Mr. Basumatry is no longer associated with UPPL as he was suspended from the party on 10th January, 2024, and disciplinary action was taken against him after… pic.twitter.com/jpSeSHMynC
— Pramod Boro (@PramodBoroBTR) March 27, 2024
తాజావార్తలు
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!