Site icon NTV Telugu

Defamation Case: గౌరవ్‌ గొగోయ్‌పై అస్సాం సీఎం శర్మ భార్య పరువునష్టం కేసు..! ఏంటి వివాదం..?

Assam Cm

Assam Cm

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం కేసు పెట్టనున్నారు. బిస్వా శర్మ భార్య రింకీ భుయాన్ శర్మతో సంబంధం ఉన్న కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో డబ్బులు అందాయని లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు. శర్మ భార్యతో సంబంధం ఉన్న కంపెనీ కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ.10 కోట్లు సబ్సిడీగా పొందిందని కాంగ్రెస్ వాదిస్తోంది. దీనికి సంబంధించి హిమంత బిస్వా శర్మ, కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ ఒకరిపై ఒకరు ‘X'(ట్విట్టర్)వేదికగా తీవ్రంగా దాడి చేసుకుంటూనే ఉన్నారు.

Read Also: Dark Circles Under Eyes: మీ కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయా..? వీటిని ట్రై చేయ్యండి రిజల్ట్స్ చూడండి..!

ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో శర్మ భార్య రింకీ భుయాన్ శర్మ కంపెనీ ప్రైడ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 10 కోట్లు సంబంధిత రాయితీగా పొందినట్లు సమాచారం అందించినట్లు కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ బుధవారం (సెప్టెంబర్ 13) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పై బిశ్వ శర్మ స్పందిస్తూ.. ఎవరైనా రుజువు చేయగలిగితే.. ప్రజా జీవితం నుండి పదవీ విరమణతో సహా ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Read Also: Karnataka: 20 సంవత్సరాల క్రితం దొంగతనం.. ఎట్టకేలకు చిక్కాడు

గోగాయ్ ఆరోపణపై సీఎం బిస్వా శర్మ స్పందిస్తూ.. తన భార్య, ఆమెతో సంబంధం ఉన్న కంపెనీ కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి డబ్బు తీసుకోలేదని తాను స్పష్టం చేశారు. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో శర్మ భార్య రింకీ భుయాన్‌తో లింక్ చేయబడిన కంపెనీ పేరు వ్రాయబడిందని గొగోయ్ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

Exit mobile version