NTV Telugu Site icon

Assam: చేతబడి ద్వారా చికిత్స చేయడాన్ని నిషేధించే బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం

Assam

Assam

చేతబడి ద్వారా చికిత్స చేయడాన్ని నిషేధించే బిల్లుకు అస్సాం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే బిల్లుకు హిమంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, సీఎం హిమంత బిశ్వ శర్మ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చెవుడు, మూగతనం, అంధత్వం, శారీరక వైకల్యం, పరాయీకరణ వంటి పుట్టుకతో వచ్చే వ్యాధులకు చికిత్స పేరుతో మాంత్రిక వైద్యం యొక్క పద్ధతులను తొలగించడం ఈ బిల్లు యొక్క లక్ష్యం.. వైద్యం పేరుతో పేదలు, అమాయకుల నుంచి డబ్బులు దండుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి శర్మ చెప్పారు.

Read Also: Gas Cylinder Blast: హైదరాబాద్ లో శివారులో భారీ అగ్ని ప్రమాదం..!

ఇక, గౌహతిలోని లోక్ సేవా భవన్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అస్సాం పర్యాటక శాఖ మంత్రి జయంత మల్లా బారుహ్ ప్రకటించారు. అలాగే, మ్యాజికల్ హీలింగ్‌ను పరిష్కరించడంతో పాటు దిబ్రూఘర్ జిల్లాలోని నామ్‌డాంగ్ రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌లో వైల్డ్‌లైఫ్ సఫారీ & రెస్క్యూ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రూ. 259 కోట్లతో అంచనా వ్యక్తంతో ఏర్పాటు కాబోతుంది. ఈ ప్రాంతంలోని జంతుజాలానికి రక్షణ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది.

Read Also: Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

అలాగే, స్థిరమైన పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని అస్సాం రాష్ట్ర పర్యటక మంత్రి జయంత మల్లా బారుహ్ తెలిపారు. రాష్ట్రంలోని ఇతర పట్టణ స్థానిక సంస్థలకు ‘టెన్ సిటీస్ డెవలప్‌మెంట్ కాన్సెప్ట్’కు మంత్రివర్గం ఆమోదించింది. ఈ నగరాలు – తిన్సుకియా, డిబ్రూగర్, శివసాగర్, జోర్హాట్, గోలాఘాట్, నాగావ్, తేజ్‌పూర్, నార్త్-లఖింపూర్, బొంగైగావ్, సిల్చార్, కరీంగంజ్, ధుబ్రి, హఫ్లాంగ్/డిఫు – స్థిరమైన పట్టణాభివృద్ధికి కృషి చేస్తాయని ఆయన వెల్లడించారు.