Asia Cup Trophy Controversy: ఆసియా కప్ ట్రోఫీ “దొంగ” అయిన పాకిస్థాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీని బీసీసీఐ వదిలిపెట్టే స్థితి కనిపించడం లేదు. ఇంతలో మరో ప్రధాన వార్త వెలువడింది. ACC అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేశారు. అయితే.. ఈ ట్రోఫీని టీం ఇండియాకు ఎప్పుడు అందజేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్ మొహ్సిన్ నఖ్వీపై అభిశంసన ప్రవేశ పెట్టేందుకు భారత క్రికెట్ బోర్డు పరిశీలిస్తోందని వార్తలు వెలువడ్డాయి. జాతీయ మీడియా సంస్థల సమాచారం ప్రకారం.. నఖ్వీ ACC, ICC ప్రతిష్టను దెబ్బతీశారని ఏసీసీ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా చెబుతున్నారు. నఖ్వీ ప్రవర్తన అనుచితమైన, అనాగరికమైనదన్నారు. తదుపరి ఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో యూఏఈ బోర్డుకు కప్‌ను అప్పగిస్తున్నట్లు సమాచారం వెలువడింది.
READ MORE: Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ఇటీవల ముగిసిన 2025 ఆసియా కప్ ట్రోఫీ చుట్టూ వివాదం కొనసాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ చివరి మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో భారత్ vs పాకిస్థాన్ మధ్య జరిగింది. టైటిల్ గెలుచుకున్న టీం ఇండియా మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫిని ఎత్తుకెళ్లారు. నఖ్వీ బాధ్యతారహిత చర్య వల్ల క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. అయితే.. ఆయనకు గుణపాఠం చెప్పాలని బీసీసీఐ దృఢంగా నిశ్చయించుకుంది. ట్రోఫీ వివాదంపై తన వైఖరిని స్పష్టం చేస్తూ, ట్రోఫీని తమకు తిరిగి ఇవ్వాలని బీసీసీఐ పేర్కొంది. లేకపోతే.. నేరుగా ఏసీసీ కార్యాలయం నుంచి తీసుకుంటామని చెప్పింది.
READ MORE: Dussehra : ట్రైసిటీలో దసరా ఉత్సవాల.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
