Site icon NTV Telugu

Asia Cup 2025: సూపర్-4 జట్లు ఖరారు.. భారత్, పాకిస్థాన్ మధ్య మరోసారి సంగ్రామం!

Asia Cup 2025

Asia Cup 2025

Asia Cup 2025: ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్‌లో సూపర్-4 దశకు చేరిన నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఇప్పటికే గ్రూప్-A నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు స్థానం సంపాదించగా.. తాజాగా గ్రూప్-B నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు కూడా అర్హత సాధించాయి. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. గ్రూప్-B చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ కూడా సూపర్-4లోకి ప్రవేశించింది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచే ఉంటే బంగ్లాదేశ్ నిష్క్రమించాల్సి వచ్చేది. అయితే శ్రీలంక అలా జరగనివ్వలేదు.

India vs Oman: నేడు ఒమన్‌తో భారత్‌ ఢీ.. రెండు మార్పులు తప్పవా? తుది జట్లు ఇవే

ఈ గ్రూప్‌ Bలో శ్రీలంక మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ రెండు విజయాలతో 4 పాయింట్లతో రెండో స్థానంలో ముగించింది. ఒకే ఒక్క విజయంతో ఆఫ్ఘనిస్తాన్ మూడో స్థానంలో నిలిచింది. హాంగ్‌కాంగ్ మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోగా చివరన నిలిచింది. ఇక గ్రూప్-A నుంచి భారత్, పాకిస్తాన్ ముందుగానే సూపర్-4లోకి వచ్చాయి. భారత్ నేడు (19 సెప్టెంబర్)న ఓమాన్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అయితే అంతకుముందే పాకిస్తాన్, UAEపై విజయాలు సాధించి సూపర్-4లోకి అడుగుపెట్టింది. పాకిస్తాన్ కూడా ఓమాన్, UAEపై గెలిచి అర్హత పొందింది. UAE ఒక్క మ్యాచ్ గెలిచి మూడో స్థానంలో నిలవగా, ఓమాన్ ఒక్క విజయమూ సాధించలేక చివరి స్థానంలో నిలిచింది.

Chemical Factory Blast: కెమికల్ కంపెనీలో భారీ బ్లాస్ట్.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

దీనితో ఇక సూపర్-4లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య హోరాహోరీ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి ఆసియా కప్ సూపర్ ఫోర్స్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20న దుబాయ్‌లో జరిగే 13వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడతాయి. తరువాతి రోజు, సెప్టెంబర్ 21న అదే వేదికలో జరిగే 14వ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ పోరు జరుగుతుంది. సెప్టెంబర్ 23న అబుదాబిలో పాకిస్థాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే, సెప్టెంబర్ 24న దుబాయ్‌లో బంగ్లాదేశ్, భారత్ జట్లు తలపడతాయి. సెప్టెంబర్ 25న మళ్లీ దుబాయ్‌లోనే బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్ల మధ్య 17వ మ్యాచ్ ఉంటుంది. చివరిగా, సెప్టెంబర్ 26న దుబాయ్‌లో భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. వీటిలో టాప్ 2 దేశాలు సెప్టెంబర్ 28న ఫైనల్ ఆడనున్నాయి.

Exit mobile version