Asia Cup 2025: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 రేపటి (సెప్టెంబర్ 9) నుండి ప్రారంభం కానుంది. ఈసారి ఆసియాలోని 8 జట్లు పొట్టి ఫార్మాట్‌లో (T20I) తలపడనున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్ దుబాయ్, అబుదాబి స్టేడియాల్లో జరగనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు కొనసాగే ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశ, సూపర్ 4 దశ, ఆఖరిగా ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ టోర్నమెంట్‌లో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, యూఏఈ, ఒమాన్, హాంకాంగ్ జట్లు పాల్గొంటున్నాయి.
Content Over Budget: బడ్జెట్ కాదు భయ్యా.. కంటెంట్ ముఖ్యమంటున్న సినీ అభిమానులు!
టోర్నీ కోసం జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో ఇండియా, పాకిస్థాన్, యూఏఈ, ఒమాన్ ఉన్నాయి. గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో దాయాది జట్లు భారత్, పాకిస్థాన్‌ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తోంది. భారత జట్టుకు సూర్యకుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. శుభ్మన్ గిల్, సంజూ సామ్‌సన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.
Shocking Murder: ప్రియుడితో కలిసి మొగుడిని చంపిన మూడో భార్య.. రెండో భార్య ఏం చేసిందంటే!
ఇక పాకిస్థాన్ జట్టుకు సల్మాన్ అలీ ఆగా నాయకత్వం వహించనుండగా, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ వంటి బలమైన బౌలర్లు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్, శ్రీలంక జట్టుకు అసలంక, బంగ్లాదేశ్ జట్టుకు లిట్టన్ దాస్ సారథ్యం వహించనున్నారు. ఇండియాలో ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీలివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
