Site icon NTV Telugu

Asia Cup 2025: నలుగురు స్టార్స్ రీఎంట్రీ.. ఆసియా కప్ 2025కు ఊహించని స్వ్కాడ్!

Asia Cup 2025 India Squad

Asia Cup 2025 India Squad

Asia Cup 2025 India Squad Update: 2025 ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమై.. 28తో ముగుస్తుంది. ఆతిథ్య హక్కులు భారత్‌ దగ్గరే ఉన్నా.. గతంలో పాకిస్తాన్‌తో ఒప్పందంలో భాగంగా తటస్థ వేదిక యూఏఈలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగనుండగా.. అబుదాబి, దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో భారత్ తన మొదటి మ్యాచ్‌ ఆడనుంది. టోర్నీకి ఇంకా నెల రోజుల సమయం ఉన్నా.. బీసీసీఐ సెలెక్టర్లు జట్టుపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2025కు ఊహించని స్వ్కాడ్ ఉంటుందని తెలుస్తోంది.

తాజా అప్‌డేట్ ప్రకారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆగస్టు 3వ వారంలో భారత జట్టును ప్రకటించనుంది. ఐపీఎల్ 2025లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టీమిండియా స్టార్స్ శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. జీటీ ఆటగాడు సాయి సుదర్శన్ కూడా ఆసియా కప్ 2025కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలానే ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: MLA Kova Laxmi: కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ విసిరిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే!

విశ్రాంతి పేరిట మొన్నటివరకు స్టార్ ఆటగాళ్లకు టీ20 ఫార్మాట్‌లో సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. దాంతో ఐపీఎల్ స్టార్స్ అవకాశాలు అందుకున్నారు. ఇప్పుడు కీలక టోర్నీ కావడంతో టాప్ ఆటగాళ్లను ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో అగ్రశ్రేణి జట్టును ఎంపిక చేయాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే గిల్, యశస్వి , శ్రేయాస్, కృనాల్ జట్టులోకి రానున్నారు. సంజూ శాంసన్‌ ప్రధాన వికెట్ కీపర్‌గా ఉంటాడని తెలుస్తోంది. గాయం కారణంగా రిషభ్‌ పంత్‌ ఎంపికయ్యే అవకాశాలు లేవు. స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఫిట్‌నెస్ పరీక్షలు పాసవ్వాలి. ఈ ఇద్దరు కూడా జట్టులోకి వస్తే పేస్ కోటాలో రేసు రసవత్తరంగా మారుతుంది.

భారత జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, సాయి సుదర్శన్, కృనాల్ పాండ్యా.

Exit mobile version