Site icon NTV Telugu

Haris Rauf: ఛీ.. ఛీ.. మొత్తానికి పాకిస్థానీ బుద్ధి బయటపెట్టావ్ కదరా.. వీడియో వైరల్

Haris Rauf

Haris Rauf

Haris Rauf: ప్రస్తుతం క్రికెట్‌లో భారత్‌తో పోటీపడి గెలవడం పాకిస్థాన్‌కు రోజురోజుకు కష్టమవుతోంది. ఇక ఆ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన కూడా మైదానంలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే, ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్‌లో భారత్‌పై గెలిచేందుకు తన జట్టుకు అవసరమైన వికెట్లు తీయలేకపోయిన పాకిస్థాన్ పేసర్ ‘హారిస్ రవూఫ్’ బౌండరీ లైన్ వద్ద అభిమానులతో అనుచితంగా ప్రవర్తించాడు. రవూఫ్ ‘విమానం కూలిపోతున్నట్లు’ చేసిన సైగలు భారతీయ అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Head Constable Help Students: హ్యాట్సాఫ్ వెంకటరత్నం.. మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్..

బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. 2022 టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రెండు వరుస సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ భారత అభిమానులు ‘విరాట్ కోహ్లీ’ అని నినాదాలు చేశారు. అయితే, రవూఫ్ ఆ తర్వాత చేసిన పని రెచ్చగొట్టే విధంగా ఉంది. ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత జరిగిన సైనిక పోరాటంలో ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ చేస్తున్న నిరాధార వాదనలను సూచిస్తూ ఆ పాకిస్థాన్ పేసర్ అభిమానుల వైపు ‘6-0’ అని సైగ చేశాడు. ఆ తర్వాత విమానాలు కూలిపోతున్నట్లు చేతి సైగలు కూడా చేశాడు.

IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్ లో ప్లేయర్ల మధ్య గొడవ.. రెచ్చిపోయిన అభిషేక్!

రాజకీయాలు, క్రీడలు పూర్తిగా వేరుగా ఉండాలని పాకిస్థాన్, ఆ దేశ మాజీ ఆటగాళ్లు చాలా మంది చెబుతున్నప్పటికీ.. హారిస్ రవూఫ్ వంటి ఆటగాళ్ల ప్రవర్తన చూస్తే సరిహద్దు అవతల క్రికెటర్లు నిజంగా ఏం భావిస్తున్నారో అర్థమవుతోంది. ఇకపోతే ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ మరోసారి ఓడిపోయింది. ఒకవేళ పాకిస్థాన్ మిగిలిన రెండు మ్యాచ్ లలో భారీ విజయం సాధిస్తే.. టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంటాయి. అక్కడ మరోసారి ఇరు జట్లు తలపడే అవకాశం ఉంది.

Exit mobile version