Haris Rauf: ప్రస్తుతం క్రికెట్‌లో భారత్‌తో పోటీపడి గెలవడం పాకిస్థాన్‌కు రోజురోజుకు కష్టమవుతోంది. ఇక ఆ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన కూడా మైదానంలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే, ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్‌లో భారత్‌పై గెలిచేందుకు తన జట్టుకు అవసరమైన వికెట్లు తీయలేకపోయిన పాకిస్థాన్ పేసర్ ‘హారిస్ రవూఫ్’ బౌండరీ లైన్ వద్ద అభిమానులతో అనుచితంగా ప్రవర్తించాడు. రవూఫ్ ‘విమానం కూలిపోతున్నట్లు’ చేసిన సైగలు భారతీయ అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో…