Sunil Gavaskar: యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్ 2025లో భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం ఇబ్బందులు పడుతున్నాడు. ఈ టోర్నీలో 5 ఇన్నింగ్స్‌లలో కేవలం 71 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో చేసిన 47 నాటౌట్ ఇన్నింగ్స్ మినహా అతని ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో, భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూర్యకుమార్‌కు ఒక సూచన ఇచ్చాడు. బ్యాటింగ్ ప్రారంభించేటప్పుడు కనీసం మూడు లేదా నాలుగు బంతులు తీసుకొని పిచ్‌ను అంచనా వేయాలని ఆయన సూర్యకుమార్ కు సలహా ఇచ్చాడు. డగౌట్‌లో చూసే దానికి, మైదానంలో ఆడే దానికి చాలా తేడా ఉంటుందని, కనుక కొన్ని బంతులు తీసుకుని పిచ్‌పై పేస్, బౌన్స్, టర్న్ అంచనా వేసుకోవడం మంచిదని గవాస్కర్ పేర్కొన్నాడు.
Nep vs WI: పరువంతపాయె.. రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుపై పసికూన గెలుపు
కెప్టెన్సీలో మాత్రం సూర్యకుమార్ యాదవ్ తనదైన ముద్ర వేశాడు. అతని సారథ్యంలో భారత్ వరుసగా ఆరు విజయాలతో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. నేడు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తుందని గవాస్కర్ ధీమా వ్యక్తం చేశాడు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రమే ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా రాణించాడని, మిగతా బ్యాటర్లందరి నుంచి పెద్ద ఇన్నింగ్స్ రావాల్సి ఉందని గవాస్కర్ అన్నారు. అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో 309 పరుగులు చేసి ఆసియా కప్‌లో 300 పరుగుల మార్క్‌ను చేరుకున్న మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
High Tension Chennai: హీరో విజయ్ ఇంటి వద్ద హైటెన్షన్.. మద్రాసు హైకోర్టుకు టీవీకే!
ఇక ఫైనల్ మ్యాచ్ లో గిల్, సూర్యకుమార్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా లాంటి వారు రాణించాల్సి ఉందని గవాస్కర్ అన్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చే ఆటగాళ్లు భారత జట్టులో చాలా మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గత మ్యాచ్ లో దురదృష్టవశాత్తు రనౌట్‌గా ఔట్ అయి సెంచరీ అవకాశాన్ని కోల్పోయిన అభిషేక్ శర్మ ఫైనల్ మ్యాచ్‌లో మూడు అంకెల స్కోరు సాధించే అవకాశం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
