Site icon NTV Telugu

Asia Cup 2025: పసికూన హాంగ్ కాంగ్‌ను ఉతికారేసిన అఫ్గానిస్తాన్.. ఒమర్జాయ్ వీరవిహారం!

Azmatullah Omarzai Fifty

Azmatullah Omarzai Fifty

ఆసియా కప్ 2025లో భాగంగా అబుదాబి స్టేడియంలో హాంగ్ కాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ సెదిఖుల్లా అటల్ (73; 52 బంతుల్లో 6×4, 3×6) హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో అజ్మతుల్లా ఒమర్జాయ్ వీరవిహారం చేశాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 53 రన్స్ బాదాడు. మహమ్మద్ నబీ (33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాంగ్ కాంగ్‌ బౌలర్లలో ఆయుష్ శుక్లా, కించిత్ షా తలో రెండు వికెట్స్ పడగొట్టారు.

Also Read: Cherlapally Drug Case: దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉందా?.. చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారా?

ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే అఫ్గాన్ జట్టుకు షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (8), ఇబ్రహీం జద్రాన్ (1)లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో సెదిఖుల్లా అటల్, మహమ్మద్ నబీ జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరు అవుట్ కావడంతో అఫ్గాన్ 150 పరుగులు చేస్తుందా? అని అందరూ అనుకున్నారు. అయితే అజ్మతుల్లా ఒమర్జాయ్ హాంగ్ కాంగ్‌ బౌలర్లపై వబిరుచుకుపడ్డాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. పసికూన హాంగ్ కాంగ్‌పై ఒమర్జాయ్ తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. హాంగ్ కాంగ్‌ విజయ లక్ష్యం 189 రన్స్.

Exit mobile version