Team India: ఆసియా కప్‌లో టీమిండియా వరుస విజయాలు.. సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌తో ఢీ!
- ఒమన్‌పై ఘన విజయం
- సెమీఫైనల్లో భారత్-ఏ
- అఫ్గానిస్థాన్‌తో ఢీ
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్-ఏ జట్టు గ్రూప్ దశను అజేయంగా ముగించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ నేతృత్వంలోని భారత్-ఏ టీమ్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్-బీలో భాగంగా బుధవారం అల్ అమెరత్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్-ఏ జట్టును భారత్ ఢీకొంటుంది.
ఈ మ్యాచ్‌లో మొదట ఒమన్ 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మహ్మద్ నదీమ్ (41; 49 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. హమ్మద్ మీర్జా (28) రాణించాడు. రసిఖ్ సలామ్ (1/23), సాయి కిశోర్ (1/21) ఒమన్‌ను కట్టడి చేశారు. మోస్తరు లక్ష్యాన్ని భారత్-ఏ 15.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆయుష్ బదోని (51; 27 బంతుల్లో 6×4, 2×6) హాఫ్ సెంచరీ చేయగా.. తిలక్ వర్మ (36 నాటౌట్; 30 బంతుల్లో 1×4, 2×6), అభిషేక్ శర్మ (34; 15 బంతుల్లో 5×4, 1×6) రాణించారు.
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
Also Read: IND vs NZ 2nd Test: నేటి నుంచే రెండో టెస్టు.. రాహులా, సర్ఫరాజా!
ఒక్కో గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి. ఒమన్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రయించింది. గ్రూప్-బీలో పాకిస్తాన్ రెండు విజయాలతో సెమీస్ చేరింది. ఇక గ్రూప్-ఏలో శ్రీలంక, అఫ్గానిస్థాన్‌లు సెమీస్ చేరాయి. బంగ్లాదేశ్, హాంకాంగ్, యూఏఈలు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!