NTV Telugu Site icon

Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023 షెడ్యూల్‌.. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మ్యాచ్!

Ind Vs Pak

Ind Vs Pak

India vs Pakistan Match Likely On September 2 in Asia Cup 2023: హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న పురుషుల ఆసియా కప్ 2023 షెడ్యూల్ బుధవారం (జూలై 19) విడుదల కానుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) కొత్త చైర్మన్ జాకా అష్రఫ్ బుధవారం రాత్రి 7.45కి లాహోర్‌లో అధికారిక షెడ్యూల్‌ను ప్రకటిస్తారు అని పీసీబీ పేర్కొంది. ఈ టోర్నమెంట్ ఆగష్టు 31న లాహోర్‌లో ప్రారంభమవుతుందని సమాచారం. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుందని తెలుస్తోంది.

ఆసియా కప్ 2023 షెడ్యూల్ ( Asia Cup 2023 Schedule) జులై 15న ఖరారు అయినా.. టోర్నీ ఏర్పాట్లు మరియు మార్కెటింగ్ ప్రచారాలకు సంబంధించి పీసీబీ మరియు ఏసీసీ అధికారుల మధ్య సమావేశం కారణంగా నేడు రిలీజ్ చేస్తున్నారట. భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ఎన్నో గొడవల తర్వాత ఆసియా కప్‌ 2023 నిర్వహణకు అన్ని మార్గాలు క్లియర్ అయ్యాయి.

Also Read: Funny Cricket Video: బంతి ఇవ్వనన్న బ్యాటర్.. వెంటపడిన కీపర్! వీడేమో చూస్తే అస్సలు నవ్వాగదు

హైబ్రీడ్ మోడల్‌లో జరగనున్న ఆసియా కప్‌ 2023లో 13 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ 13 మ్యాచ్‌లకు పాకిస్తాన్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్‌లో 4, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. పాక్‌లో నాలుగు మ్యాచ్‌ల అనంతరం.. టోర్నీ శ్రీలంకకు తరలిపోతోంది. శ్రీలంకలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. 2023 ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే పాకిస్తాన్‌లో పర్యటించేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తటస్థ వేదికపై మ్యాచ్‌లు జరుగనున్నాయి.

అంచనాల ప్రకారం ఆగస్టు 31న ప్రారంభమయ్యే 2023 ఆసియా కప్.. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌తో పాటు నేపాల్ కూడా ఈ టోర్నీలో ఆడబోతోంది. ఈ ఎడిషన్‌లో మూడేసి జట్లుగా రెండు గ్రూప్‌లుగా తొలి రౌండ్ మ్యాచులు ఆడుతాయి. ఆపై సూపర్ 4 రౌండ్‌లో టాప్‌లో నిలిచిన రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

Also Read: Kohli-Sachin: అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు.. సచిన్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ!