NTV Telugu Site icon

Asia Cup 2023 Schedule: ఆసియా కప్‌కు బీసీసీఐ, పీసీబీ గ్రీన్‌ సిగ్నల్‌.. శ్రీలంకలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్!

Ind Vs Pak

Ind Vs Pak

Asia Cup 2023 India vs Pakistan Match in Sri Lanka: ఆసియా కప్‌ 2023 షెడ్యూల్ త్వరలోనే విడుదల కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. 13 మ్యాచ్‌ల ఈ టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఏషియన్‌ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయం తీసుకుందట. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాతే ఏసీసీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. నివేదికల ప్రకారం భారత్, పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంకలోనే జరగనుంది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశం కోసం అన్ని క్రికెట్ బోర్డుల ఉన్నతాధికారులు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఉన్నారు. మంగళవారం జరిగిన ఐసీసీ సమావేశం సందర్భంగా పీసీబీ నూతన ఛైర్మన్ జాకా అష్రాఫ్, బీసీసీఐ కార్యదర్శి జే షా సమావేశమయ్యారు. ఐసీసీ సమావేశం అనంతరం వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ 2023కి సంబందించిన షెడ్యూల్‌పై కూడా వీరు చర్చయించారట. హైబ్రీడ్ మోడల్‌లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు దాయాది బోర్డులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయట. దాంతో ఏసీసీ త్వరలోనే అధికారిక షెడ్యూల్ విడుదల చేస్తుందని తెలుస్తోంది.

Also Read: Naveen Polishetty Dialogues: కష్టపడ్డా.. అనుష్క శెట్టితో చేశా! నవీన్ పొలిశెట్టి డైలాగ్స్ వైరల్

హైబ్రీడ్ మోడల్‌లో జరగనున్న ఆసియా కప్‌ 2023లో మొత్తం 13 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ 13 మ్యాచ్‌లకు పాకిస్తాన్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్‌లో 4, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముందుగా పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత టోర్నీ శ్రీలంకకు తరలిపోతోంది. శ్రీలంకలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం.. 2023 ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే పాకిస్తాన్‌లో పర్యటించేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తటస్థ వేదికపై మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఆగస్టు 31న ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023.. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌తో పాటు ఈసారి నేపాల్ కూడా మొట్టమొదటిసారిగా ఆడబోతోంది. ఈ ఎడిషన్‌లో మూడేసి జట్లుగా రెండు గ్రూప్‌లుగా తొలి రౌండ్ మ్యాచులు ఆడుతాయి. ఆపై సూపర్ 4 రౌండ్‌లో టాప్‌లో నిలిచిన రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

Also Read: Tomatoes As Birthday Gift: బర్త్‌డే గిఫ్ట్‌గా 4 కేజీల టమోటాలు.. తెగ ఆనందపడిపోయిన మహిళ!

Show comments