Site icon NTV Telugu

Rohit Sharma: రోహిత్ శర్మ డకౌట్.. టీమిండియా సారథి ఖాతాలో చెత్త రికార్డ్

Rohit Sharma

Rohit Sharma

ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్-4 రౌండ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగులకే కీలక రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి, జోరు మీదున్న కనిపించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కుర్రాడు తంజీమ్‌ హసన్ షేక్ బౌలింగ్‌లో అనమోల్ హక్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 28 ఇన్నింగ్స్‌లు డబుల్ డీజిట్ స్కోర్లు చేస్తూ వచ్చిన రోహిత్ శర్మ, ఇవాళ్టి మ్యాచ్‌లో దాన్ని అందుకోలేకపోయాడు.

Read Also: Changure Bangaru Raja Review: ఛాంగురే బంగారురాజా రివ్యూ

ఆసియా కప్ చరిత్రలో మూడుసార్లు డకౌట్ అయిన మొట్టమొదటి టీమిండియా ప్లేయర్‌గా చెత్త రికార్డును రోహిత్ శర్మ మూటకట్టుకున్నాడు. ఇంతకుముందు భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా రెండేసి సార్లు డకౌట్ కాగా.. ఆసియా కప్ చరిత్రలో డకౌట్ అయిన రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఇంతకు ముందు 1988 ఆసియా కప్ ఎడిషన్‌లో అప్పటి భారత కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ డకౌట్ అయ్యాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 29వ డకౌట్ అయ్యాడు. టాపార్డర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలిచాడు.

Read Also: Health Tips: ఆహారం విషయంలో ఈ పొరపాట్లు చేస్తే.. ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే..!

సచిన్ టెండూల్కర్ 34, విరాట్ కోహ్లీ 33, వీరేంద్ర సెహ్వాగ్ 31 సార్లు డకౌట్ కాగా, రోహిత్ శర్మ కంటే ముందున్నారు. అలాగే ఆసియా కప్‌లో రెండు సార్లు డకౌట్ అయిన భారత ఓపెనర్ కూడా రోహిత్ శర్మనే నిలిచాడు. ఇంతకు ముందు ఏ భారత ఓపెనర్ కూడా రెండు సార్లు డకౌట్ కాలేదు.. విరాట్ కోహ్లీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆరంగ్రేటం వన్డేలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 రన్స్ చేసిన తిలక్ వర్మ, తంజీమ్ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

Exit mobile version