Site icon NTV Telugu

Asia Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాక్.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?

Pak Mpl

Pak Mpl

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎద‌రుచూస్తున్న ఆసియా క‌ప్ నేడు ( బుధవారం ) స్టార్ట్ అయింది. మొద‌టి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో నేపాల్ జ‌ట్టు తలపడుతుంది. అయితే, టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ కు నేపాల్ బౌల‌ర్లు వ‌రుస షాక్స్ ఇచ్చారు. ఓపెన‌ర్లు ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్ ల‌ను స్వల్ప వ్యవధిలో అవుట్ అయ్యారు. దీంతో పాకిస్తాన్ టీమ్ 25 ప‌రుగుల‌కే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో ప‌డింది. ప్రస్తుతం కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్‌, మహ్మద్ రిజ్వాన్లు టీమ్ ను ఆదుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో పాక్ జ‌ట్టు 10 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది.

Read Also: G20 Summit: లగ్జరీ కార్‌కి ఒక్క రోజు రెంట్ రూ. 1 లక్ష.. అంతా జీ20 మహిమ

అయితే, ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు 29 ఓవర్లకు 133 పరుగులు చేసి కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. ఇక, మూడో వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 105 పరుగుల వద్ద రిజ్వాన్ దిపేంద్ర సింగ్ వేసిన త్రోకి రనౌట్ అయ్యాడు. దీంతో ఆఘా సల్మాన్ బ్యాటింగ్ కు వచ్చాడు. అతడు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయాడు. కేవలం 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక.. ప్రస్తుతం క్రీజులో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అర్థ సెంచరీ పూర్తి చేసుకుని బ్యాటింగ్ చేస్తుండగా.. ఇఫ్తికార్ అహ్మద్ 3 రన్స్ తో నాటౌట్ గా ఉన్నాడు. మరోవైపు నేపాల్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో పరుగులు తీసేందుకు పాక్ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు.

Read Also: CM Yogi: యూపీ సీఎం కీలక ప్రకటన.. కన్యా సుమంగళ యోజన రూ.10 వేలు పెంపు!

Exit mobile version