Asia Cup 2023: ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌-పాకిస్తాన్.. జులై 23న మ్యాచ్?

India A And Pakistan A

India A And Pakistan A

Lets See India A vs Pakistan A Match in Emerging Asia Cup 2023 Final: ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023 టోర్నీలో యువ భారత్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. బుధవారం పాకిస్తాన్-ఏతో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 48 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. ఖాసిమ్‌ అక్రమ్‌ (48) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లు రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌ (5/42), మానవ్‌ సుతార్‌ (3/36) రాణించారు. ఆపై సాయి సుదర్శన్‌ (104; 110 బంతుల్లో 10×4, 3×6) సెంచరీ చేయడంతో భారత్‌ 36.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్‌, పాకిస్తాన్ జట్లు ఇదివరకే ఎమర్జింగ్‌ వన్డే ఆసియా కప్‌ 2023 సెమీస్‌కు చేరాయి. అయితే ఈ టోర్నీలో దాయాదులు మరోసారి తలపడే అవకాశం ఉంది. శుక్రవారం జరిగే సెమీస్‌లలో బంగ్లాదేశ్‌ను భారత్‌, శ్రీలంకను పాకిస్థాన్‌ ఢీకొంటాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఆదివారం (జులై 23) కొలొంబో వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.

×
×
Ad

ఎమర్జింగ్‌ వన్డే ఆసియా కప్‌ 2023 ఆటగాళ్ల ఫామ్‌ దృష్ట్యా శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్‌, పాకిస్తాన్ జట్లు బాగున్నాయి. బంగ్లాదేశ్‌ను భారత్‌, శ్రీలంకను పాకిస్థాన్‌ ఓడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే ఆసియా కప్‌ 2023లో భారత్‌-పాక్‌లు మరోసారి తలపడటం ఖాయం. తొలి సెమీస్‌ ఉదయం 10 గంటలకు ఆరంభం కానుండగా.. రెండో సెమీస్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

Also Read: Netflix: నెట్‌ఫ్లిక్స్‌ కీలక నిర్ణయం.. ఇకపై పాస్‌వర్డ్ షేరింగ్‌ బంద్!

Also Read: Fisker Ocean EV Launch: ఒక్కసారి చార్జ్ చేస్తే 707 కిమీ ప్రయాణం.. సోలార్ ప్యానెల్ రూఫ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ కారు!