NTV Telugu Site icon

India vs Pakistan: టీమిండియాకు అంత సీన్ లేదు.. పాకిస్తానే గెలుస్తుంది!

Ind Vs Pak

Ind Vs Pak

Danish Kaneria React about India vs Pakistan Match in Asia Cup 2023: క్రికెట్ ప్రపంచంలో భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ కంటే పెద్ద గేమ్ ఉండదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు ప్రపంచాన్ని ఏలుతున్న సాకర్‌కు కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు 89 వేల మంది ప్రేక్షకులు హాజరయితే.. టీ20 ప్రపంచకప్ 2022లో ఇండో-పాక్ మ్యాచ్‌కు ఏకంగా 90 వేలకు పైగా మంది హాజరయ్యారు. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై ప్రపంచం మొత్తం ఓ కన్నేసి ఉంచుతుంది. మెగా మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. రాబోయే రెండు నెలల్లో దాయాది జట్లు ఐదు సార్లు తలపడే అవకాశం ఉంది.

ఆసియా కప్ 2023కి సమయం ఆసన్నమైంది. ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీ జరగనుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే భారత తుది జట్టు ఇంకా సెట్ అయినట్లు కనిపించడం లేదు. విండీస్ పర్యటనలో ప్రయోగాలు బెడిసికొట్టాయి. నాలుగో స్థానంలో ఎవరు ఆడుతారో ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. ఈ విషయంనే పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా స్పందించాడు. టీమిండియాకు ఇంకా సెట్ అవ్వలేదని, పాకిస్తాన్ పైచేయి సాధిస్తుందని పేర్కొన్నాడు.

క్రికెట్ అడిక్టర్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దానిష్ కనేరియా చాలా విషయాలపై స్పందించాడు. దానిష్ మాట్లాడుతూ… ‘భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో కచ్చితంగా పాక్ మెరుగైన స్థితిలో ఉంది. పాక్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే.. టీమిండియా ఇంకా సెట్ అయినట్లు కనిపించడం లేదు. తుది జట్టుపై పూర్తి అవగాహన లేదు. బ్యాటింగ్ ఆర్డర్ సహా.. బౌలింగ్ విభాగంలో కూడా ఎవరిని తీసుకోవాలనే దానిపై ఇంకా డిసైడ్ అవ్వలేదు. విండీస్ పర్యటనలో భారత్ ప్రయోగాలు బెడిసికొట్టాయ్’ అని అన్నాడు.

Also Read: OLA S1 Pro Price: ఓలా నుంచి 2 సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫుల్ ఛార్జింగ్‌తో 151కిమీ ప్రయాణం!

‘స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ నిలకడ ప్రదర్శించడం లేదు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లను స్పిన్నర్లుగా తీసుకోవడం బెటర్. బ్యాకప్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్‌ని తీసుకోవచ్చు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఎన్‌సీఏలో బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆసియా కప్‌ 2023లో ఆ ఇద్దరినీ ఆడించే అవకాశం ఉంది. అయితే బాగా ప్రాక్టీస్ చేశారని ఎవరినీ నేరుగా జట్టులోకి తీసుకోలేరు. గాయపడిన వారు రాణించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. లేదా వాళ్లు ఎలా ఆడతారో చెప్పలేం. మరి భారత్ వీరి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి’ అని పాక్ మాజీ స్పిన్నర్ పేర్కొన్నాడు.