Ravichandran Ashwin: “అది తలతిక్క బ్యాటింగ్”.. అభిషేక్ ఫామ్‌పై అశ్విన్ ఫైర్.. గంభీర్, సూర్యకు కీలక సలహా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin: రేపు(ఆదివారం) టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఉంటాడా? లేదా? అనే అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో అభీపై విశ్వాసం ఉంచాలని ఆఫ్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. అయితే అదే సమయంలో అభిషేక్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు సైతం చేశాడు. సెమీ ఫైన్‌లో అభిషేక్ “తలతిక్క బ్యాటింగ్” చేశాడని తీవ్రంగా విమర్శించాడు. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని ఆడటం అభిషేక్ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం అని సూచించాడు. గతంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతను అద్భుతంగా ఆడాడని గుర్తు చేశాడు. ముఖ్యంగా మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ వంటి నాణ్యమైన బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్న అనుభవం ఉందని గుర్తు చేశాడు. అందుకే ఒక్కసారి ఫామ్ తగ్గిందని వెంటనే అతనిపై నమ్మకం కోల్పోవద్దని సూచించాడు.
READ MORE: Bengaluru: బెంగళూరుకు మరో ఎయిర్‌పోర్ట్.. ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
Also Read
- Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
- Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
- Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
అయితే సెమీస్‌లో అభిషేక్ ఆట తీరు తనను నిరాశ పర్చిందని అశ్విన్ తెలిపాడు. విల్ జాక్స్ బౌలింగ్‌లో ఎనిమిది పరుగులు సాధించిన తరువాత మరింత పెద్ద షాట్లకు ప్రయత్నించడం తప్పిదమన్నాడు. అప్పటికే మరో వైపు సంజూ అద్భుతంగా ఆడుతున్నాడని గుర్తుచేశాడు. అలాంటి సమయంలో ఒక సింగిల్ తీసుకుని స్ట్రైక్ మార్పిడి చేస్తే సరిపోయేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కొన్నిసార్లు బంతిని వదిలేయడం బ్యాటర్‌కు అవసరమని సూచించాడు. “అభిషేక్ ప్రతిభపై నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ అతనిపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జట్టు యాజమాన్యం చూసుకోవాలి. ముఖ్యంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతనితో సరైన సంభాషణ జరపాలి. ఒత్తిడి పెరిగితే బంతిని మరింత బలంగా కొట్టాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో అభిషేక్ సహజ ఆటతీరు దెబ్బతింటుంది. అభిషేక్ స్వభావంగా టైమింగ్‌పై ఆధారపడే బ్యాటర్. అతన్ని సానుకూలమైన మనస్తత్వంలో ఉంచితేనే ప్రతిభ బయటపడుతుంది. అందుకే తుదిపోరులోనూ అతనికి అవకాశమివ్వాలి.” అని అశ్విన్ వివరించాడు.
తాజావార్తలు
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
-
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!