బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి.. ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది..నిత్యం సోషల్ మీడియాలో హాట్ లుక్ లో దర్శనం ఇస్తున్న ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది.. ఇలాంటి లుక్ లో ఎప్పుడూ కనిపించలేదని సదరు ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.. అది కూడా అమెరికాలో ఇలాంటి డ్రెస్సులో కనిపించడం గమనార్హం..
డబ్ స్మాష్ వీడియోలతో యంగ్ బ్యూటీ అషురెడ్డి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆ క్రేజ్ తోనే కింగ్, అక్కినేని నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎంట్రీ ఇచ్చింది..బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 మరియు సీజన్ 5లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా రెండు సార్లు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ప్రతి టాస్క్ లో తనదైన శైలిని ప్రదర్శించి ఆకట్టుకుంది. మరింత క్రేజ్ ను సాధించింది.. అలా హావు నుంచి బయటకు వచ్చినా తర్వాత పలు షోలలో మెరిసింది..కొన్ని షోలకు హోస్ట్ గా కూడా చేసింది…
అంతేకాదు వర్మ తో చేసిన ఒక ఇంటర్వ్యూ తో మళ్లీ జనాల్లో క్రేజ్ ను అందుకోవడం తో పాటు విమర్శలు కూడా అందుకుంది..తాజాగా ఈ ముద్దుగుమ్మ విదేశపు వీధుల్లో తిరుగుతున్న సందర్భంగా కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చింది. సింపుల్ లుక్ లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ చాలా సాధారమైన లుక్ తోనూ ఆకట్టుకుంది.హంగామా లేకుండా పద్ధతిగా కనిపించింది..కొద్దిరోజుల కింద అషురెడ్డి ఓ డ్రగ్స్ కేసులో ఉందని వార్తలు వస్తున్నాయి. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ వివాదంలో ఈ బ్యూటీ పేరు కూడా బయటకి వచ్చింది. ఈక్రమంలో లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ ‘ఎప్పుడూ దయతో ఉండండి’ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది..డ్రగ్స్ తాను తీసుకొనని నన్ను ఇందులో లాగకండి అంటూ సీరియస్ అయ్యింది.. అలాంటి వ్యక్తులతో తనకు పరిచయం కూడా లేదని బదులిచ్చింది.. ఇక అసలు నిజం ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..