Ashok Mali: ప్రస్తుతం కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పూణే నాగరానికి చెందిన ‘గర్బా కింగ్’ గా ప్రసిద్ధి చెందిన నటుడు అశోక్ మాలి చకన్ లోని ఒక కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తుండగా తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో చూసినట్లుగా మాలి తన కొడుకుతో కలిసి గర్బా ప్రదర్శిస్తుండగా, అతను అకస్మాత్తుగా గుండె నొప్పికి గురై కుప్పకూలిపోయాడు. విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
Mayor Murder: 6 రోజుల క్రితమే మేయర్గా బాధ్యతలు.. ఆపై దారుణ హత్యకు గురి
ధూలే జిల్లాలోని షింద్‌ఖేడా తాలూకాలోని హోల్ గ్రామానికి చెందిన మాలి, ‘గర్బా కింగ్’గా ప్రసిద్ధి చెందిన కారణంగా అతని ప్రదర్శనను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. అతను గత 5 సంవత్సరాలుగా గార్బా ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చకన్ లోని నవరాత్రి ఈవెంట్ కోసం నిర్వాహకులు అతన్ని ఆహ్వానించారు. అక్కడ అతని కుమారుడు భవేష్‌తో కలిసి, అతను ప్రదర్శన సమయంలో ఇలా అకస్మాత్తుగా చనిపోయాడు.
VIDEO | Ashok Mali, also known as Pune Garba King, died due to a heart attack while playing Garba during the Navratri festival event in Chakan last night.
(Video Source: Third Party) pic.twitter.com/uRcZI3EDky
— Press Trust of India (@PTI_News) October 8, 2024