Ashok Gehlot: రాజస్థాన్‌లో రాజకీయ రగడ.. సోనియాగాంధీని కలవనున్న అశోక్ గెహ్లాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gehlot: రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ రగడ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాత్కాలిక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఇవాళ ఢిల్లీలో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ముందుగా అనుకున్న విధంగా గెహ్లాట్ నామినేషన్‌పై స్పష్టత కొరవడిన క్రమంలో పార్టీ అధినేత్రి సోనియాతో భేటీకి ప్రాధాన్యత నెలకొంది. గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడితే తదుపరి ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్‌ను ఎంపిక చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆదివారం 80 మందికి పైగా గెహ్లాట్ వర్గానికి చెందిన శాసనసభ్యులు సభాపతి సీపీ జోషికి రాజీనామాలు సమర్పించిన సంగతి తెలిసిందే. సోనియా గాంధీతో భేటీ కోసం రాజస్థాన్ ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది.
జులై 2020లో గతంలో పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్‌కు రాజస్థాన్ సీఎం పదవిని అప్పగిస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. సీఎంగా గెహ్లాట్ సూచించిన వ్యక్తినే ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. రాజస్దాన్‌లో రాజకీయ పరిణామాలను చక్కదిద్దేందుకు, గెహ్లాట్, పైలట్ వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ పరిశీలకులుగా మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్‌లను కాంగ్రెస్ నియమించింది. వారిద్దరూ పార్టీ వ్యవహారాలపై ఇప్పటికే సోనియా గాంధీకి లిఖితపూర్వక నివేదిక అందించగా మరోవైపు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ నేత కమల్‌నాథ్‌కు సైతం రాజస్ధాన్ పరిణామాలను చక్కదిద్దే బాధ్యతను పార్టీ అప్పగించింది. ఈ పరిణామాల నేపధ్యంలో అశోక్ గెహ్లాట్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!