పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ కుమార్తె ఆసీఫా భుట్టో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా ఆమె ప్రమాణం చేశారు. మార్చి 29న షహీద్ బెనజీరాబాద్ నుంచి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆసీఫా సింధ్ ప్రావిన్స్‌లోని షహీద్ బెనజీరాబాద్ ప్రాంతం నుంచి ఎన్నికయ్యారు. ఆమె తండ్రి జర్దారీ దేశ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆ స్థానం ఖాళీ అయింది. ఆమెకు వ్యతిరేకంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో షహీద్ బెనజీరాబాద్ నుంచి అసీఫా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇది కూడా చదవండి: Namburu Sankara Rao: ఎమ్మెల్యే నంబూరి శంకరరావు సమక్షంలో వైసీపీలోకి చేరికలు..
అసీఫా భుట్టో.. జర్దారీ-బెనజీర్ భుట్టో దంపతుల చిన్న కుమార్తె. ఈ ఏడాదే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రికి తోడుగా ఉంటున్నారు. షహీద్ బెనజీరాబాద్ ప్రాంతం నుంచి నేషనల్ అసెంబ్లీ సీటు కోసం అసీఫా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమెతో పాటు నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు ఉపసహరించుకోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: ఆగ్రహంతో ఊగిపోయిన కింగ్ కోహ్లి.. వైరల్ వీడియో..!
1988 నుంచి 1990 వరకు, 1993 నుంచి 1996 వరకు పాకిస్థాన్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా బెనజీర్ భుట్టో పని చేశారు. 2007లో ఆమె హత్యకు గురయ్యారు. 31 ఏళ్ల ఆమె చిన్న కుమార్తె ఆసీఫా ఈ ఏడాదే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మార్చి 10న పాకిస్థాన్ అధ్యక్షుడిగా రెండోసారి జర్దారీ బాధ్యతలు చేపట్టారు. అంతకముందు 2008 నుంచి 2013 వరకు పాక్ అధ్యక్షుడిగా పని చేశారు. తాజాగా రెండోసారి ఆయనను ఈ పదవి వరించింది. ఇక పాకిస్థాన్ ప్రథమ మహిళగా అసీఫాను ఎంపిక చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇది కూడా చదవండి: Sunitha Kejriwal : గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సునీతా కేజ్రీవాల్
జర్దారీ, బెనజీర్ భుట్టో దంపతులకు ముగ్గురు పిల్లలు, కొడుకు బిలావల్, కుమార్తెలు భక్తవర్, అసీఫా. చిన్న కుమార్తైన
అసీఫా.. లండన్ నుంచి పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 21 ఏళ్ల వయసులో ఆక్స్‌ఫర్ యూనియన్‌లో ప్రసంగించిన అతి పిన్న వయస్కురాలుగా గుర్తింపు పొందారు. ట్విట్టర్‌లో 29 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 4 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక అసీఫా పాకిస్థాన్‌లో పోలియో నిర్మూలన అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. అలాగే వ్యాధి బారిన పడ్డ కుటుంబాలను కూడా ఆమె పరామర్శించారు. దీంతో ఆమె పెద్ద సామాజిక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఈ ఉద్యమంతో ఆమె ప్రజల దృష్టిని ఆకర్షించారు.
ఇది కూడా చదవండి: Accidents in Telangana: తెలంగాణలో వేర్వేరు ప్రమాదాలు.. ఇద్దరు చిన్నారులు మృతి
