IPL2023 : కేకేఆర్ కు వరుస షాక్ లు.. టోర్నీ నుంచి కీలక ప్లేయర్స్ ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంకో పదిరోజుల్లో ఐపీఎల్-16 సీజన్ మొదలుకోబోతున్న నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు వరుస షాకులు తాకుతున్నాయి. ఇదివరకే ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి గాయం కారణంగా వచ్చే సీజన్ లో ఆడేది అనుమానంగానే ఉండగా తాజాగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తో పాటు మరో బంగ్లా ప్లేయర్ లిటన్ దాస్ కూడా ఈ సీజన్ లో పలు మ్యాచ్ లకు దూరం కానున్నారు.
Also Read : Expressway: సీఎం గారు.. నా కారు మీరే బాగుచేయించాలి
Also Read
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
కేకేఆర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ బంగ్లా ప్లేయర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెష్ ఇవ్వలేదు.. ప్రస్తుతం బంగ్లాదేశ్.. స్వదేశంలో ఐర్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఆడుతోంది. ఐర్లాండ్-బంగ్లాదేశ్ ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లలో షకిబ్ తో పాటు లిట్ దాస్ కూడా ఉన్నాడు. ఏప్రిల్ 9 నాటికి ఐర్లాండ్-బంగ్లాదేశ్ ల మధ్య సిరీస్ లు ముగిస్తాయి. అప్పటికే ఐపీఎల్ మొదలవుతుంది. ఈ మ్యాచ్ లు ముగిసేదాకా బంగ్లాదేశ్.. షకిబ్, దాస్ లకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం అనుమానమేనని తెలుస్తోంది.
Also Read : Mahesh Babu: ఈయన అన్నం తింటున్నాడా లేక అందం తింటున్నాడా?
ఇప్పటికే వెన్ను నొప్పి గాయం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఈ సీజన్ మొత్తానికి దూరమవుతాడని.. లేకుంటే కనీసం ఫస్టాఫ్ వరకైనా దూరం కానున్నాడని వార్తులు వినిపిస్తున్నాయి. దీంతో అనుభవం ఉన్న షకిబ్ అల్ హసన్ కు సారథ్య పగ్గాలు అప్పజెప్పుతారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు హసన్ కూడా ఈ సీజన్ లో పలు మ్యాచ్ లకు దూరం కానున్నాడని తెలియడంతో కేకేఆర్ అభిమానులు షాక్ లో ఉన్నారు.
Also Read : Weather : తెలంగాణలో భారీ వర్షాలు.. తడిసిన మహానగరం!
అయ్యర్ తో పాటు షకిబ్ కూడా దూరం కావడంతో మరి కేకేఆర్ నెక్ట్స్ కెప్టెన్ ఎవరు..? అనే ప్రశ్నకు ఆ జట్టును వేధిస్తుంది. మూడు రోజుల క్రితం ఆ జట్టు బ్యాటర్ రింకూ సింగ్ ను కేకేఆర్ సారథిగా నియమించనుందనే వార్తలు కూడా వినిపించాయి. ఈ మేరకు కేకేఆర్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఓ ప్యాన్ పోస్టుకు రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని తెలిపిన కొద్దిసేపటికే మళ్లీ డిలీట్ చేసింది. తాజా పరిణామాలతో కేకేఆర్ అసలు కెప్టెన్ గా ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!