Ramayana : రణబీర్‌లో రాముడినే చూస్తారు – అరుణ్ గోవిల్ సెన్సేషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ చరిత్రలో ‘రామాయణం’ వెండితెరపై ఆవిష్కృతమవుతుందంటే ప్రేక్షకుల్లో ఉండే ఉత్కంఠే వేరు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, మన సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతంలో బుల్లితెర రామాయణంలో రాముడిగా నటించి ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయిన అరుణ్ గోవిల్, రణబీర్ లుక్స్.. పర్‌ఫార్మెన్స్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Also Read : Vishwambhara : విశ్వంభర టీజర్‌పై విమర్శలు.. యూవీ క్రియేషన్స్ షాకింగ్ డెసిషన్!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అరుణ్ గోవిల్ మాట్లాడుతూ.. ‘దేవుడి పాత్రలను పోషించడం సామాన్యమైన విషయం కాదు. ప్రేక్షకులు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు పాత పాత్రలతో పోల్చడం సహజం. మనం దేవుడి పాత్ర చేస్తున్నప్పుడు, చూడగానే ఆ దేవుడే దిగి వచ్చాడా అన్నట్టుగా ఉండాలి. అందుకే ఈ పాత్రలకు ‘లుక్స్’ అనేవి చాలా ముఖ్యం’ అని ఆయన వివరించారు. అలా రణబీర్ కపూర్ గురించి చెబుతూ.. ‘ఆడియన్స్ తెరపై మనల్ని (నటులను) చూడరు, ఆ పాత్రలో ఉన్న దేవుడిని చూస్తారు. బహుశా దేవుడు నిజంగా ఇలానే ఉంటాడేమో అన్నట్లుగా మనం ప్రేక్షకులను ప్రభావితం చేయాలి. రణబీర్ కపూర్ ఆ విషయంలో సక్సెస్ అవుతాడు, జనం ఆయనలో దేవుడిని చూస్తారని’ అరుణ్ గోవిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన రాముడి పాత్రల కంటే ఇది భిన్నంగా, ప్రభావవంతంగా ఉండబోతోందని ఆయన హింట్ ఇచ్చారు.
నితేష్ తివారీ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ (Yash) రావనుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా.. కైకేయి/మంధరిగా లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ కథను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం పగలు రాత్రి కష్టపడుతోంది. అరుణ్ గోవిల్ లాంటి లెజెండరీ నటుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రణబీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..