Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- వెస్టిండీస్‌తో మూడో టీ20లో 3 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్..
- ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కైవసం..
- గత మ్యాచ్‌లో బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh: ఇండోర్‌లో అర్ష్‌దీప్ సింగ్ అదిరిపోయే బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 44 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది. మ్యాచ్ అనంతరం తన బౌలింగ్, గత మ్యాచ్‌లో ఎదురైన వైఫల్యం, టీ20 క్రికెట్లో మానసిక బలం గురించి అర్ష్‌దీప్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
వెస్టిండీస్‌తో మూడో టీ20లో అర్ష్‌దీప్ బంతితో చెలరేగాడు. అయితే గత మ్యాచ్‌లో తన బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదని చెప్పాడు. అందుకే ఈసారి జట్టు కోసం మెరుగ్గా రాణించాలనే పట్టుదలతో బరిలోకి దిగినట్లు వెల్లడించాడు. ఇండోర్ పరిస్థితులపై మాట్లాడుతూ.. బంతి కొంత రివర్స్ స్వింగ్ అయిందని, ముఖ్యంగా డెత్ ఓవర్లలో బంతి రివర్స్ అవుతుంటే బౌలింగ్ చేయడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాడు. మంచు ఉన్న పరిస్థితుల్లోనూ బౌలింగ్ చేయడం తనకు ఇష్టమేనని తెలిపాడు. గత మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేయలేకపోయానని, ఈసారి జట్టు కోసం మంచి ప్రదర్శన చేయాలని భావించానని.. అందుకు తగిన ఫలితం వచ్చిందని పేర్కొన్నాడు.
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
బౌలింగ్ యూనిట్లో కీలక ఆటగాడిగా ఉంటూ ఒక మ్యాచ్‌లో విఫలమైన తర్వాత ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు అర్ష్‌దీప్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. జట్టులో లీడర్, సీనియర్ అనే తేడా లేకుండా అందరూ ఒకరికొకరు అండగా ఉంటారని చెప్పాడు. ఎవరైనా ఆటగాడు విఫలమైనప్పుడు అతడు జట్టులో ఎంతో ముఖ్యమైన సభ్యుడని గుర్తు చేస్తూ మద్దతుగా నిలుస్తామని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఉన్నప్పుడు మంచి రోజులు, చెడు రోజులు రెండూ ఉంటాయని అర్ష్‌దీప్ అన్నాడు. “ప్రశాంతంగా ఉన్నంతకాలం తిరిగి వచ్చి మళ్లీ మంచి ప్రదర్శన చేయగలం” అనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
టీ20ల్లో బ్యాటర్లు తొలి ఓవర్లలో, డెత్ ఓవర్లలో భారీ షాట్లకు ప్రయత్నించడం తనకు నచ్చుతుందని అర్ష్‌దీప్ చెప్పాడు. అదే బౌలర్‌కు అసలైన సవాల్ అని పేర్కొన్నాడు. ఆ సమయంలో తన నైపుణ్యాలను, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని, మానసిక బలాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుందని తెలిపాడు. ఇంకా టీ20 క్రికెట్లో వరుస మ్యాచ్‌లు, మారుతున్న పరిస్థితులకు త్వరగా అలవాటు పడటం ఎంతో ముఖ్యమని అర్ష్‌దీప్ చెప్పాడు. కొత్త బంతితో, పాత బంతితో బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టడంతో పాటు వీలైనంతగా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని పేర్కొన్నాడు. షెడ్యూల్ ఎప్పుడూ బిజీగా ఉంటుందని.. అందుకే పరిస్థితులకు త్వరగా అనుగుణంగా మారాల్సి ఉంటుందని, పరిస్థితులకు త్వరగా అలవాటు పడే జట్టే ఎక్కువగా విజయవంతమవుతుందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా కూడా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడేందుకు ప్రయత్నిస్తోందని వెల్లడించాడు.
తాజావార్తలు
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!