Site icon NTV Telugu

Arshdeep Singh చెత్త రికార్డు.. ఒక ఓవర్ లో 13 బంతులు.. 7 వైడ్‌లు.. కోచ్ గంభీర్ ఆగ్రహం!

Arshdeep Singh

Arshdeep Singh

Arshdeep Singh: ముల్లాన్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన పేలవ ప్రదర్శనతో అనవసరమైన రికార్డును మూటగట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో బౌలింగ్ చేయడానికి వచ్చిన అర్ష్‌దీప్.. పూర్తిగా లయ తప్పి చెత్త రికార్డును నమోదు చేశాడు. క్వింటన్ డికాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 11వ ఓవర్ తొలి బంతిని డికాక్ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత ఒత్తిడికి గురైన అర్ష్‌దీప్ పూర్తిగా లైన్ తప్పి బౌలింగ్ చేశాడు. ఆ ఒక్క ఓవర్‌లోనే అర్ష్‌దీప్ ఏకంగా ఏడు (7) వైడ్ బాల్స్‌ వేశాడు. ఈ వైడ్‌ల కారణంగా 6 బంతుల ఓవర్ కాస్తా.. ఏకంగా 13 బంతుల మ్యారథాన్ ఓవర్‌గా మారింది. మొత్తంగా ఆ ఓవర్‌లో అర్ష్‌దీప్ మొత్తం 18 పరుగులు సమర్పించుకున్నాడు.

USA: ఇండియన్ టెక్కీలను తిరిగి పంపండి… H-1B వర్కర్లు అక్రమ వలసదారుల కన్నా ప్రమాదం..

ఈ చెత్త ప్రదర్శనతో అర్ష్‌దీప్ సింగ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన ఆటగాడిగా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. గతంలో అఫ్గానిస్తాన్‌కు చెందిన నవీన్-ఉల్-హక్ జింబాబ్వేపై (2024లో) ఒకే ఓవర్‌లో 13 బంతులు వేసి ఇదే చెత్త రికార్డును సృష్టించాడు. ఈ అవసరం లేని రికార్డుతో అర్ష్‌దీప్ టీ20 ఫార్మాట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

Ind vs SA 2nd T20I: క్వింటన్ డికాక్ విధ్వంసం.. టీమిండియాకు భారీ టార్గెట్..!

అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో వైడ్లు వేస్తూ పరుగులను ధారాళంగా ఇస్తుండగా.. డగౌట్‌లో ఉన్న భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం స్పష్టంగా కనిపించింది. గంభీర్ కోపంగా ఉన్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే గంభీర్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Exit mobile version