NTV Telugu Site icon

Sri Lanka: శ్రీలంకలో 60 మంది భారతీయుల అరెస్ట్.. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడినట్లు గుర్తింపు

New Project (11)

New Project (11)

ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడిన 60 మంది భారతీయులను శ్రీలంకలోక్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) అరెస్టు చేసింది. కొలంబోలోని మడివెల, బత్తరముల్లా, పశ్చిమ తీర నగరమైన నెగోంబో నుంచి వారిని గురువారం అరెస్టు చేశారు. ఈ దాడిలో 135 మొబైల్స్, 57 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి ఎస్‌ఎస్‌పి నిహాల్ తల్దువా తెలిపారు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. అనుమానంతో నెగొంబోలోని ఓ ఇంటిపై సోదాలు నిర్వహించగా కీలక ఆధారాలు లభించాయి. మొదటగా13 మంది అనుమానితులను ప్రాథమికంగా అరెస్టు చేశారు. వారి నుంచి 57 ఫోన్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి ఆపరేషన్ల ఫలితంగా మిగతా వారిని మందిని అరెస్ట్ చేశారు. వీరికి అక్కడే ఉంటున్న ఓ కుటుంబం సహాయం చేస్తున్నట్లు గుర్తించారు. సోషల్‌ మీడియాలో నగదు ఇస్తామని చెప్పి బాధితురాలిని వాట్సాప్‌ గ్రూప్‌లోకి లాక్కెళ్లారు. ప్రాథమిక చెల్లింపు తర్వాత మిగిలిన డబ్బును డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేసినట్లు విచారణలో వెల్లడైంది.

READ MORE: Darshan controversies: మర్డర్ కేసు మాత్రమే కాదు.. దర్శన్ వివాదాల లిస్టు చూశారా?

అంతర్జాతీయ సంబంధాలు బహిర్గతం..
ఈ వ్యక్తులకు దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్ తో కూడా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నట్లు బహిర్గతమయ్యాయి. బాధితుల్లో స్థానికులు, విదేశీయులు కూడా ఉన్నారని నివేదిక పేర్కొంది. వీరు ఆర్థిక మోసాలు, అక్రమ బెట్టింగ్‌లు, జూదం వంటి పలు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు.