Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ వైపు అర్నబ్ తుఫాన దూసుకొస్తున్న సమయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం అవుతోంది.. ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకుంటుంది.. మరోవైపు.. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో అర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మెరైన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీరం వెంబడి భద్రతా చర్యలను ముమ్మరం చేసి, పర్యాటకులు బీచ్‌కు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
అంతర్వేది బీచ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, పర్యాటకుల ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారు. బీచ్ పరిసరాల్లో మెరైన్ పోలీసులు కాపలా కాస్తూ అక్కడికి వచ్చే పర్యాటకులను వెనక్కి పంపిస్తున్నారు. తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించడంతో తీర ప్రాంత యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు, తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సముద్రంలోకి వేటకు వెళ్లకుండా మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేట బోట్లు అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నాయి. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసిన అధికారులు, ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read
- MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
-
Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Vijay-Rashmika: విరోష్ జంటపై ఫేక్ ప్రచారం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్!
-
Arnab Cyclone Alert: తుఫాన్ విరుచుకుపడుతుంది.. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు..
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!