Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnab Cyclone Alert: అర్నబ్.. అతి తీవ్ర తుపాన్‌గా బలపడుతోంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా తుఫాన్ పయనిస్తోంది. గంటకు 23 కి.మీ. వేగంతో పయనిస్తున్న అర్నబ్.. 24 గంటల పాటు ప్రభావం చూపనుంది. తుపాన్ వేగంగా కదులుతుండటంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
అర్నబ్ తుపాన్ గత ఆరు గంటల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదిలింది. సాయంత్రం వరకు పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి.. ఆ తర్వాత వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు ఉదయానికి బాపట్ల–విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరం దాటే అవకాశమున్నట్లు సమాచారం. తుపాన్ ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తీర ప్రాంతాల్లో ఇప్పటికే గాలుల తీవ్రత పెరిగినట్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read
- AR Rahman: "ఆ ఓపిక, సమయం నాకు లేదు".. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
- Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
- Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
- AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
అర్నబ్ తుపాన్ ప్రభావంతో విశాఖపట్నం తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో పాటు సముద్రం ముందుకు చొచ్చుకురావడం, తీరప్రాంతం కోతకు గురవడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. సముద్రం ప్రమాదకరంగా మారడంతో బీచ్‌లలో పర్యాటకుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. రుషికొండ బీచ్‌ను ఏపీ టూరిజం మూసివేసింది. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. తీర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
తుపాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదురైతే త్వరితగతిన స్పందించేందుకు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా సహాయం పొందవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, జిల్లా కలెక్టర్ల నుంచి వెలువడే అధికారిక హెచ్చరికలను మాత్రమే అనుసరించాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, సముద్ర తీరాలకు సమీపంగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త