Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnab Cyclone Alert: తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుఫాన్ కొనసాగుతోంది.. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్నిప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.. దీంతో, ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేస్తోంది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యుత్ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు.
ఈ నేపథ్యంలో APCPDCL సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కారణంగా భారీ గాలులు వీచి విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు సర్కిల్, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. తుపాను సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు APCPDCL సీఎండీ పి. పుల్లారెడ్డి..
Also Read
- Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
- Murmura Recipe: ఇంట్లోనే కరకరలాడే మరమరాలు తయారు చేసుకోండి.. సులభమైన తయారీ విధానం ఇదిగో!
- Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
- Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
కాగా, తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అన్నీ పాఠశాలకు సెలవులు ప్రకటించారు అధికారులు.. తుఫాన్ తీరం దగ్గరకు వచ్చే కొద్ది దాని తీవ్రత కనిపిస్తుందని చెబుతున్నారు.. దీంతో.. రేపు, ఎల్లుండి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు నేపథ్యంలో విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లవద్దని సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
-
Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
-
Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
-
Murmura Recipe: ఇంట్లోనే కరకరలాడే మరమరాలు తయారు చేసుకోండి.. సులభమైన తయారీ విధానం ఇదిగో!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!